పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహిన్ అఫ్రిది 2021లో అత్యద్భుత ఫామ్‌ను కనబరిచాడు. ముఖ్యంగా టి20ల్లో అత్యంత ప్రభావితం చూపిన షాహిన్ అఫ్రిది ఐసీసీ అవార్డుకు కూడా నామినేట్ అయ్యాడు. ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ సెమీఫైనల్ చేరడంలో షాహిన్ కీలకపాత్ర పోషించాడు. 21 ఏళ్ల ఈ యంగ్ బౌలర్ ఆ టోర్నీలో 10 వికెట్లు తీశాడు. తాజగా శనివారం ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్య్వూలో షాహిన్ అఫ్రిది తన ''డ్రీమ్ హ్యాట్రిక్''ను ఎంపిక చేశాడు. షాహిన్ డ్రీమ్ హ్యాట్రిక్ మరెవరో కాదు.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లే. అయితే షాహిన్ తన డ్రీమ్ హ్యాట్రిక్‌ను ఇప్పటికే పూర్తి చేశాడు.
టి20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో మ్యాచ్‌ను షాహిన్ అఫ్రిది శాసించాడు. ఆరంభంలోనూ ఈ ముగ్గురి వికెట్లు తీసి టీమిండియాను దెబ్బ కొట్టాడు. తన మొదటి స్పెల్‌లో రోహిత్, రాహుల్‌ను వెనక్కి పంపిన షాహిన్.. తన రెండో స్పెల్‌లో కోహ్లిని ఔట్ చేశాడు. కాగా ఇంటర్య్వూలో మీ దృష్టిలో అత్యంత ఖరీదైన వికెట్ ఏది అని అడగ్గా.. దానికి షాహిన్ టక్కున ''విరాట్ కోహ్లి'' అని చెప్పాడు. ఇక ఆ మ్యాచ్‌లో టీమిండియా 151 పరుగులు చేయగా.. పాకిస్తాన్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించడం విశేషం. బాబర్ అజమ్, మహ్మద్ రిజ్వాన్‌లు అర్థసెంచరీలతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు.
ఇక 2022 టి20 ప్రపంచకప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఇటీవలే విడుదల చేసింది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న పొట్టి ప్రపంచకప్‌లో మరోసారి ఈ రెండుజట్లు తలపడనున్నాయి. అక్టోబర్ 23న టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. మరి మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న ఆ మ్యాచ్‌లో టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment