నెట్స్‌లో ప్రాక్టీసు చేస్తున్న శిఖర్ ధావన్(Pic: shikhardofficial/ Instagram)
Shikhar Dhawan shares video: ‘‘నా పెదాల మీద చిరునవ్వు తీసుకువచ్చే సన్నివేశం చూడాలంటే స్వైప్ చేయండి’’ అంటూ టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. నెట్స్‌లో ప్రాక్టీసు చేస్తున్న దృశ్యాలను పంచుకుంటూ తన ఆనందం ఆటతోనే ముడిపడి ఉందని పేర్కొన్నాడు. కాగా గతేడాది శ్రీలంక టూర్ తర్వాత ధావన్‌కు మళ్లీ భారత జట్టులో చోటు దక్కలేదు.
ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన 36 ఏళ్ల గబ్బర్.. 14 మ్యాచ్‌లలో కలిపి 38.33 సగటుతో 460 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేటు 122.67. అయినప్పటికీ దక్షిణాఫ్రికాతో ఇటీవల స్వదేశంలో ముగిసిన టీ20 సిరీస్‌కు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ను పక్కనపెట్టేశారు సెలక్టర్లు.
యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోనే టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ మేరకు ధావన్ ఎంపిక విషయంలో సెలక్టర్లకు సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి. టీ20 ప్రపంచకప్-2022 సమీపిస్తున్న నేపథ్యంలోనే ఇలా చేసినట్లు వాదనలు వినిపించాయి. అయితే, అదే సమయంలో గబ్బర్‌ను కాదన్నారు సరే.. దినేశ్ కార్తిక్‌కు మాత్రం ఎలా ఎంపిక చేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
కనీసం ఐర్లాండ్‌తో సిరీస్‌కు కూడా అతడిని ఎంపిక చేయకపోవడంపై ధావన్ అభిమానులు గుస్సా అయ్యారు. ఇదిలా ఉంటే.. గబ్బర్ మాత్రం నిరాశ చెందక తన పని తాను చేసుకుకోతున్నాడు. నెట్స్‌లో చెమటోడుస్తూ ప్రాక్టీసు చేస్తున్నాడు.
చదవండి: Rashid Latif: 'ఐపీఎల్ అంటేనే బిజినెస్'.. విషం చిమ్మిన పాక్ మాజీ క్రికెటర్
Jos Buttler Six Viral Video: దయ, జాలి లేకుండా..'అందుకే అనేది బట్లర్ మామూలోడూ కాదని'
Comments
Please login to add a commentAdd a comment