టీ20 కెప్టెన్సీపై శ్రేయ‌స్ అయ్య‌ర్‌ తొలి స్పంద‌న‌! | Shreyas Iyer 1st-Reaction-Replacing Suryakumar-As-India T20I Captain | Sakshi
Sakshi News home page

టీ20 కెప్టెన్సీపై శ్రేయ‌స్ అయ్య‌ర్‌ తొలి స్పంద‌న‌!

Jun 7 2026 10:57 AM | Updated on Jun 7 2026 12:03 PM

Shreyas Iyer 1st-Reaction-Replacing Suryakumar-As-India T20I Captain

భార‌త జ‌ట్టు టీ20 కెప్టెన్‌గా త‌న‌ను నియమించ‌డంపై శ్రేయ‌స్ అయ్య‌ర్ తొలిసారి స్పందించాడు.  ముంబై టీ20 లీగ్‌లో ముంబై ఫాల్క‌న్స్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న శ్రేయ‌స్ అయ్య‌ర్ మ్యాచ్ విజ‌యం అనంత‌రం మాట్లాడాడు. 'చాలా సంతోషంగా ఉంది. ఆట‌గాడిగా దేశానికి ప్రాతినిధ్యం వ‌హించ‌డ‌మే పెద్ద విషయం. అలాంటిది ఒక జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించ‌డం గొప్ప అనుభూతి. 

ఇది నా గౌర‌వాన్ని, బాధ్య‌త‌ను పెంచింది. ఇన్నేళ్లుగా నాకు మ‌ద్ద‌తిస్తూ అండ‌గా నిల‌బ‌డిన అభిమానుల‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. టీ20 కెప్టెన్సీ ఇచ్చిన జోష్‌తో ఇవాళ ముంబై ఫాల్క‌న్స్ త‌ర‌ఫున కీల‌క ఇన్నింగ్స్ ఆడ‌డ‌మే కాకుండా జ‌ట్టును గెలిపించ‌డం సంతోషంగా ఉంది. నిజంగా నాకు ఇది కేక్‌పై ఐసింగ్‌లాగా అనిపించింది. 

అయితే ఇవాళ మ్యాచ్‌లో నాకు ప్ర‌త్య‌ర్థిగా ఉన్న సూర్య‌కుమార్ ద‌గ్గ‌రికి వెళ్లి అత‌డిని ఆప్యాయంగా ప‌ల‌కరించాను. అత‌డు కూడా నాకు కెప్టెన్సీ రావ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇది నా జోష్‌ను డ‌బుల్ చేసింది.' అని అయ్య‌ర్ చెప్పుకొచ్చాడు.

మ్యాచ్ విష‌యానికొస్తే.. సూర్య‌కుమార్ సార‌థ్యంలోని ట్రంప్ నైట్స్ ఎంఎన్ఈ జ‌ట్టుపై శ్రేయ‌స్ అయ్య‌ర్ నేతృత్వంలోని ముంబై ఫాల్క‌న్స్ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రంప్ నైట్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 147 ప‌రుగులు చేసింది. కెప్టెన్ సూర్య‌కుమార్ (24 బంతుల్లో 48) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. నూత‌న్ కుమార్ (34)ప‌ర్వాలేద‌నిపించాడు. 

ఫాల్క‌న్స్ బౌల‌ర్ల‌లో ప్ర‌త‌మేశ్ డాకే 4 వికెట్లు తీశాడు. అనంత‌రం బ్యాటింగ్ చేసిన ముంబై ఫాల్క‌న్స్ అయ్య‌ర్ విజృంభ‌ణ‌తో 16.4 ఓవ‌ర్ల‌లోనే 5 వికెట్లు కోల్పోయి 149 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. శ్రేయ‌స్ అయ్య‌ర్ (36 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. ట్రంప్ నైట్స్ బౌల‌ర్ల‌లో హితేశ్ క‌డ‌మ్ 2 వికెట్లు తీశాడు.

చదవండి: టెస్టులో సెంచ‌రీ బాదిన వైభ‌వ్ సూర్య‌వంశీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement