
సింగపూర్: సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ టైటిల్ నిలబెట్టుకోవాలంటే భారత స్టార్ షట్లర్ పీవీ సింధు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. నేడు మొదలయ్యే ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ సింధుకు తొలి రౌండ్‌లోనే కఠిన ప్రత్యర్థి ఎదురుకానుంది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ అకానె యామగుచి (జపాన్)తో సింధు తొలి రౌండ్‌లో ఆడనుంది.
ముఖాముఖి రికార్డులో సింధు 14–9తో ఆధిక్యంలో ఉంది. భారత్‌కే చెందిన మరో స్టార్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ (థాయ్‌లాండ్)తో తలపడనుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో వాంగ్‌చరోన్ (థాయ్‌లాండ్)తో కిడాంబి శ్రీకాంత్... కొడాయ్ నరోకా (జపాన్)తో ప్రణయ్... సునెయామ (జపాన్)తో ప్రియాన్షు రజావత్... చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో లక్ష్య సేన్ ఆడతారు.
చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్.. భారత బౌలర్లకు పాక్ లెజెండ్ కీలక సలహా
Comments
Please login to add a commentAdd a comment