SL Vs SA: South Africa To Tour In Sri Lanka ODI And T20 Series - Sakshi
Sakshi News home page

Sl Vs SA: వన్డే, టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ ఇదే!

Published Fri, Jul 30 2021 5:14 PM | Last Updated on Sat, Jul 31 2021 9:27 AM

Sl Vs SA: South Africa To Tour In Sri Lanka ODI And T20 Series - Sakshi

లంక జట్టు(కర్టెసీ: ఎస్‌ఎల్‌ క్రికెట్‌)

కొలంబో: దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు శ్రీలంక టూర్‌ ఖరారైంది. మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌ల నిమిత్తం ప్రొటిస్‌ జట్టు లంకలో పర్యటించనుంది. సెప్టెంబరు 2 నుంచి సెప్టెంబరు 14 వరకు మొత్తంగా ఆరు మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్‌ ఫిక్స్‌ అయింది. కొలంబోలోని ఆర్‌ ప్రేమదాస స్టేడియంలోనే ఈ సిరీస్‌లు జరుగనున్నాయి. టీ20 ప్రపంచ కప్‌ సమీపిస్తున్న తరుణంలో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో ఇరు జట్లకు కావాల్సినంత ప్రాక్టీసు దొరకనుంది. 

జోరు మీదున్న ప్రొటిస్‌.. తాజా సిరీస్‌ గెలుపుతో జోష్‌లో లంక
ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా హాట్‌ ఫేవరెట్‌గా బరిలో దిగనుంది. ఇప్పటికే వెస్టిండీస్‌, ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వరుస విజయాలతో జోరు మీద ఉంది. ఇక, ఐదు వరుస టీ20 సిరీస్‌ పరాజయాల తర్వాత గురువారం నాటి మ్యాచ్‌లో భారత్‌పై విజయం సాధించి శ్రీలంక జట్టు తమ అపజయాల పరంపరకు అడ్డుకట్ట వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లంక ఆటగాళ్లు సైతం ఆత్మవిశ్వాసంతో మైదానంలో అడుగుపెట్టనున్నారు. 

ద్వైపాక్షిక సిరీస్‌ ఖరారైన నేపథ్యంలో దక్షిణాఫ్రికా తాత్కాలిక సీఈఓ ఫొలేసీ మొసేకి మాట్లాడుతూ.. ఉపఖండ జట్టుపై తమ టీం తప్పక విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్‌నకు ముందు తమ బలాబలాలను పూర్తిస్థాయిలో అంచనా వేసేందుకు అవకాశం దక్కిందని పేర్కొన్నాడు. 

శ్రీలంక- దక్షిణాఫ్రికా వన్డే, టీ20 సిరీస్‌ షెడ్యూల్‌
తొలి వన్డే: సెప్టెంబరు 2, 2021- కొలంబో
రెండో వన్డే: సెప్టెంబరు 4, 2021- కొలంబో
మూడో వన్డే: సెప్టెంబరు 7, 2021- కొలంబో

మొదటి టీ20: సెప్టెంబరు 10, 2021- కొలంబో
రెండో టీ20: సెప్టెంబరు 12, 2021- కొలంబో
మూడో టీ20: సెప్టెంబరు 14, 2021- కొలంబో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement