
హైదరాబాద్ టీనేజ్ క్రికెటర్ సొప్పదండి యషశ్రీకి అండర్–19 టి20 ప్రపంచకప్‌లో ఆడే అవకాశం లభించింది. ప్రస్తుతం ఈ మెగా టోర్నీ దక్షిణాఫ్రికాలో జరుగుతోంది. అయితే భారత జట్టుకు ఎంపికైన హర్లీ గాలా గాయంతో టోర్నీకి దూరమైంది.
దీంతో మెగా టోర్నీ సన్నాహక సిరీస్ ఆడేందుకు వెళ్లి అక్కడే ఉన్న యషశ్రీతో ఆమె స్థానాన్ని భర్తీ చేయాలనుకున్నారు. యషశ్రీ ఎంపికను ఐసీసీ టెక్నికల్ కమిటీ కూడా ఆమోదం తెలిపింది. ఈ టోర్నీలో నేడు జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో తలపడుతుంది.
చదవండి: India open 2023: సింధు ఇంటికి... సైనా ముందుకు