న్యూజిలాండ్ పర్యటనలో సౌతాఫ్రికా మహిళల జట్టు శుభారంభం చేసింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం హామిల్టన్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా 18 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.
ఓపెనర్ తజ్మిన్‌బ్రిట్స్ (43 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా, లారా వోల్వర్ట్ (33 బంతుల్లో 41) పర్వాలేదనిపించింది. ఆఖర్లో కయ్‌లా రెనెకె (9 బంతుల్లో 28 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో అమెలియా కెర్, జెస్ కెర్‌లు చెరో 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ మహిళల జట్టు సఫారీ బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. అమెలియా కెర్ (18 బంతుల్లో 32) టాప్ స్కోరర్‌గా నిలవగా ఇజీ షార్ప్ (29) పరుగులు చేసింది. అయితే సౌతాఫ్రికా బౌలర్లలో అయోబంగా ఖాకా 4 వికెట్లతో చెలరేగితే, లాబా 3 వికెట్లు తీసింది. కయ్‌లా రెనెకెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
చదవండి: కోహ్లి కాదు!.. అత్యుత్తమ టీ20 క్రికెటర్ అతడే: డివిలియర్స్


