టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ కెరీర్‌లు ఒకే రకంగా సాగకపోయినప్పటికీ.. కొన్ని విషయాల్లో మాత్రం ఈ ఇద్దరికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. జట్టులోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరూ..యాదృచ్చికం ఓ విషయంలో ఒకే రకమైన గణాంకాలు కలిగి ఉన్నారు. అదేంటంటే.. పొట్టి క్రికెట్‌లో ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరూ.. తమ టీ20 కెరీర్‌లో 9వ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును 39వ ఇన్నింగ్స్‌లోనే గెలుపొందారు.
Fact of the day:
— IPLnCricket | Everything 'Cricket' & #IPL2023 🏏 (@IPLnCricket) November 24, 2022
Virat Kohli Had Won his '9th T20I M.O.M Award' in his 39th Inning!
Suryakumar Yadav Won his '9th T20I M.O.M Award' in his 39th Inning!
ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ పోటీపడి మరీ పరుగులు సాధించారు. మెగా టోర్నీలో చెరో 6 మ్యాచ్‌లు ఆడిన ఇద్దరూ.. టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 1, 3 స్థానాల్లో నిలిచారు. కోహ్లి 4 హాఫ్ సెంచరీలతో 296 పరుగులు చేయగా.. సూర్య 3 అర్ధశతకాలతో 239 రన్స్ చేశాడు. వీరిద్దరూ రాణించినప్పటికీ.. టీమిండియా వరల్డ్‌కప్‌లో సెమీస్ గండాన్ని దాట లేకపోయింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఓ మోస్తరుగా రాణించినప్పటికీ.. బౌలర్లు పూర్తిగా తేలిపోవడంతో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, జగజ్జేతగా కూడా అవతరించింది.
వరల్డ్‌కప్ అనంతరం టీమిండియా.. న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఇదివరకే భారత జట్టు 1-0 తేడాతో టీ20 సిరీస్‌ను గెలుచుకోగా.. రేపటి నుంచి 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో సూర్య భాయ్ సుడిగాలి శతకంతో చెలరేగిపోయాడు. ఫలితంగా ఆ మ్యాచ్‌లో టీమిండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment