క‌సి మీదున్న సూర్య‌కుమార్‌.. 3 గంట‌ల్లో వెయ్యి బంతులా! | Suryakumar-Battled-1000-Balls-3 Hours-Strong Message Team India Management | Sakshi
Sakshi News home page

క‌సి మీదున్న సూర్య‌కుమార్‌.. 3 గంట‌ల్లో వెయ్యి బంతులా!

Jul 27 2026 11:44 AM | Updated on Jul 27 2026 12:03 PM

Suryakumar-Battled-1000-Balls-3 Hours-Strong Message Team India Management

Photo Credit: Twitter

టీమిండియా టీ20 స్పెషలిస్ట్‌, మాజీ కెప్టెన్ సూర్య‌కుమార్ క‌సిగా క‌నిపిస్తున్నాడు. పేల‌వ ఫామ్‌తో జ‌ట్టులో చోటు కోల్పోయిన సూర్య‌కుమార్ రీఎంట్రీ కోసం తెగ క‌ష్ట‌పడుతున్నాడు. ఈ క్ర‌మంలో ఆదివారం ముంబైలోని వాసూ పర‌న్‌జేప్ క్రికెట్ అకాడ‌మీలో సూర్య‌కుమార్ మూడు గంట‌ల పాటు నెట్స్‌లో సాధ‌న చేశాడు. 

దాదాపు 3 గంట‌ల పాటు వెయ్యి బంతులు ఎదుర్కొన్న సూర్య‌కుమార్ వినూత్న షాట్లు ఆడి అలరించాడు. మ‌ళ్లీ టీమిండియాలో ఎప్పుడెప్పుడు అడుగుపెడదామా అన్నంత‌గా సూర్య‌లో క‌సి క‌నిపిస్తుంది. నెట్స్‌లో చెమటోడ్చిన వీడియోను ఎక్స్‌లో పంచుకున్న సూర్య.. ‘సండే ఫ‌న్‌డే. క్విక్ ర‌న్‌. 3 గంట‌ల పాటు వెయ్యి బంతులు ఆడాను. మంచి ఫీల్ వ‌చ్చింది’ అని క్యాప్ష‌న్ జ‌త చేశాడు. తాజాగా శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలో టీమిండియా 3-0తో జింబాబ్వేను క్లీన్‌స్వీప్ చేసింది. 

ఇక 35 ఏళ్ల సూర్య‌కుమార్ టీమిండియా కెప్టెన్‌గా 2026 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను అందుకున్నాడు. అయితే బ్యాట‌ర్‌గా విఫ‌ల‌మ‌వుతూ వ‌చ్చిన సూర్య‌కుమార్ ఐపీఎల్‌లోనూ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బరిచాడు. దీంతో టీ20 కెప్టెన్సీ ప‌ద‌విని కోల్పోయిన‌ సూర్య‌కుమార్‌కు జ‌ట్టులోనూ చోటు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. 

అయితే సూర్య టీమిండియాలో చోటు కోల్పోయిన త‌ర్వాత మ‌హారాజ ట్రోఫీలో త‌న బ్యాటింగ్‌తో అద‌ర‌గొట్టాడు. అప్ప‌టినుంచి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాల‌ని ఉవ్విళ్లూరుతున్న సూర్య‌కుమార్ క‌ఠోర సాధ‌న కొన‌సాగిస్తున్నాడు. 

Read: మీరాబాయి స్వర్ణ పతకం వెనుక కన్నీటిగాథ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement