‘వాళ్లంతా క్రికెట్‌ తెలియని మూర్ఖులు’ | Suryakumar Blast-Rumours Wrist Injury-Peope Who-Dont Understand Cricket | Sakshi
Sakshi News home page

‘వాళ్లంతా క్రికెట్‌ తెలియని మూర్ఖులు’.. సూర్యకుమార్ షాకింగ్ కామెంట్స్‌!

May 26 2026 11:36 AM | Updated on May 26 2026 12:24 PM

Suryakumar Blast-Rumours Wrist Injury-Peope Who-Dont Understand Cricket

ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్లాఫ్ షో కనబరిచాడు. 13 మ్యాచ్‌ల్లో కేవలం 270 పరుగులు మాత్రమే చేసిన సూర్యకుమార్ దారుణంగా విఫలమయ్యాడు. అయితే సీజన్‌లో రాజస్తాన్‌తో మ్యాచ్‌లో 60 పరుగుల ఇన్నింగ్స్‌ సూర్యకు ఈ సీజన్‌లో చెప్పుకోదగిన ప్రదర్శన. ఇది మినహా అతడు రాణించిన దాఖలాలు లేవు. 

అయితే రాజస్తాన్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం సూర్యకుమార్ మణికట్టు గాయంతో బాధపడుతున్నాడని, అందుకే అతడి నుంచి ఆశించిన ప్రదర్శన రాలేదన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలను సూర్యకుమార్ ఖండించాడు. తనకు ఏ గాయం కాలేదని, సరిగ్గా ఆడనంత మాత్రానా గాయంతో బాధపడుతున్నట్లు ఊహించుకున్నవారంతా మూర్ఖులేనంటూ షాకింగ్ కామెంట్లు చేశాడు. అంతేకాదు తనపై వచ్చిన వార్తలన్నీ అబద్దాలేనంటూ కొట్టిపారేశాడు. 

సూర్యకుమార్ మాట్లాడుతూ..‘ఒక విషయంపై నేను స్పష్టత ఇవ్వదలచుకున్నా. నేను మణికట్టు గాయంతో బాధపడుతున్నా అని మాట్లాడుకుంటున్నవాళ్లు ఫిజియోథెరపిస్టులు కాకపోవడం లేదా క్రికెట్ గురించి అవగాహన లేని వాళ్లు అయి ఉంటారు. ఎందుకంటే, ఒకవేళ నిజంగా నేను మణికట్టు గాయం లేదా ఏదైనా సమస్యతో బాధపడుతుంటే.. ప్రాక్టీస్‌లోనూ, మ్యాచ్‌లలోనూ షాట్లు కొట్టడంలో ఇబ్బంది ఎదుర్కొనేవాడిని. 

నేను మ్యాచ్‌ల్లో ఆడే చాలా షాట్లతో పాటు ఫ్లిక్ షాట్లు నా మణికట్టుపైనే ఆధారపడి ఉంటాయి. అయితే ఈ రూమర్లను పట్టించుకునే సమయం నాకు లేదు. కానీ నేను పూర్తి ఫిట్‌గా ఉన్నప్పటికీ గాయంతో బాధపడుతున్నట్లు వార్తలు రావడం ఆగ్రహం తెప్పించింది. అందుకే పని గట్టుకొని ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నా. 

ఈ సీజన్‌లో నా నుంచి బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన రాకపోవడంపై అసంతృప్తిగానే ఉన్నా. కానీ ఈ ఏడాది మంచి హార్డ్‌వర్క్‌తోనే క్రికెట్ సీజన్‌ను స్టార్ట్ చేశాను. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నా. టీ20 ప్రపంచకప్‌లో ఆరంభంలో విఫలమైనప్పటికీ ఆఖర్లో మంచి ప్రదర్శనే కనబరిచాను. 

కానీ ఐపీఎల్‌లో మాత్రం లయను కోల్పోయి బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాను. నా ప్రదర్శన బాగాలేదని సర్దిచెప్పుకోలేను. దానిని మెరుగుపరుచుకునేందుకు ఇంకా కష్టపడుతా. ఫలితం వస్తే సంతోషం లేకుండా మళ్లీ కష్టపడతా. దేవుడు అన్నీ చూస్తున్నాడు. త్వరలోనే మళ్లీ కమ్‌బ్యాక్ ఇస్తానని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: కోహ్లీకి షాక్‌.. వైభ‌వ్ సూర్య‌వంశీకి చోటు!

Advertisement
 
Advertisement
Advertisement