కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన కోహ్లి 9 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఆసీస్ స్పిన్నర్ స్వెప్సన్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్ నాల్గో బంతికి కోహ్లి రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో టీమిండియా 48 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది. అంతకుముందు శిఖర్ ధావన్ పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. స్టార్క్ బౌలింగ్‌లో ధావన్ బౌల్డ్ అయ్యాడు. (ఇంగ్లండ్ తొండాట.. మోర్గాన్‌కు సీక్రెట్ మెసెజ్‌లు )
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. టీమిండియా ఇన్నింగ్స్‌ను రాహుల్, ధావన్‌లు ఆరంభించారు. కాగా, స్టార్క్ వేసిన మూడో ఓవర్ ఐదోబంతికి ధావన్ తడబడి బౌల్డ్‌గా నిష్క్రమించాడు. అనంతరం కోహ్లి బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లి కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. కేవలం ఫోర్ కొట్టిన కోహ్లి పెద్దగా మెరుపులేకుండా ఔటయ్యాడు. కాగా, కేఎల్ రాహుల్ మాత్రం మెరిశాడు. 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment