Toss Playing Key Role T20 WC 2021 IND Vs NZ.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా దారుణ ఓటమి తర్వాత న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతుంది. కాగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ను ఫ్యాన్స్ క్వార్టర్ ఫైనల్‌గా చూస్తుండడంతో టీమిండియాకు చావో రేవోగా మారింది. ఒకవేళ న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో గనుక టీమిండియా ఓడిపోతే సెమీస్ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారిపోతాయి. ఆ తర్వాత జరిగే మూడు మ్యాచ్‌లు కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి రాకూడదంటే కివీస్‌తో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాల్సి ఉంది.
చదవండి: NZ VS IND: తీవ్రంగా శ్రమిస్తున్న భారత ఆటగాళ్లు.. ఫొటోలు వైరల్
ఇక ఈసారి టి20 ప్రపంచకప్‌లో టాస్ కీలకపాత్ర పోషిస్తుంది. టాస్ గెలిచిన జట్టుదే విజయం అన్నట్లుగా తయారైంది. సూపర్ 12 దశలో ఇప్పటివరకు జరిగిన 9 మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన జట్టునే విజయం వరించడం విశేషం. అందులో 8 సార్లు ఫీల్డింగ్ ఎంచుకున్న జట్లు విజయాలు సాధించడం విశేషం. ఒక్క అఫ్గనిస్తాన్ మాత్రం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి విజయాన్ని అందుకొంది. దీంతో టీమిండియాకు టాస్ కీలకం కానుంది.
అయితే టాస్ విషయంలో కెప్టెన్ కోహ్లికి పెద్దగా కలిసిరాలేదు. అదీగాక ఐసీసీ టి20 ప్రపంచకప్‌ల్లో టీమిండియా న్యూజిలాండ్‌ను ఒక్కసారి కూడా ఓడించలేకపోయింది. అయితే ఫ్యాన్స్ మాత్రం టీమిండియా కివీస్‌పై విజయం సాధించాలని కోరుకుంటున్నారు. అయితే కోహ్లి మొదట టాస్ గెలవాలని.. ఆ తర్వాత మ్యాచ్ మనదే అవుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో కివీస్‌తో మ్యాచ్‌కు కోహ్లి సేనకు టాస్ కీలకంగా మారింది. అక్టోబర్ 31(ఆదివారం) జరగనున్న మ్యాచ్‌లో ఏం జరుగుతుందో వేచి చూద్దాం.
చదవండి: Chris Morris: దక్షిణాఫ్రికాతో ఆట ముగిసినట్లే.. క్రిస్ మోరిస్ ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment