
Shreyas Iyer And Ishan Kishan Watch Kohli Batting.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా టీమిండియా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతుంది. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో దారుణ ఓటమిని చవిచూసిన టీమిండియా కివీస్‌తో మ్యాచ్‌లో గెలిచి ముందంజ వేయాలని ఆశిస్తుంది. పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియా విఫలమైనప్పటికీ కోహ్లి మాత్రం సక్సెస్ అయ్యాడు. మ్యాచ్‌లో అర్థసెంచరీతో మెరిసిన కోహ్లి తాను ఫామ్‌లోనే ఉన్నట్లు తెలియజేశాడు.
చదవండి: IND Vs NZ: కివీస్‌తో మ్యాచ్ క్వార్టర్ ఫైనల్స్.. టాస్ గెలువు కోహ్లి
ఇక ఆదివారం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కోహ్లి మరోసారి మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే కోహ్లి 45 నిమిషాల పాటు కసితో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఢిఫెన్స్, స్క్వేర్‌కట్, మిడ్ వికెట్, లాంగాన్, లాంగాఫ్ మీదుగా కోహ్లి కొన్ని చూడముచ్చటైన షాట్లు ఆడాడు. దీంతో అక్కడే ఉన్న యువ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లు రెప్పవాల్చకుండా కోహ్లి బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌గా మారింది.
ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌కు చోటు దక్కలేదు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కు చాన్స్ లభించింది. అయితే కివీస్‌తో మ్యాచ్‌కు ఇషాన్ ఆడే చాన్స్ ఉంది. ఇక శ్రేయాస్ అయ్యర్ రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.
చదవండి: NAM VS SCO: టి20 ప్రపంచకప్ చరిత్రలో క్రేజీ ఓవర్ అంటున్న ఫ్యాన్స్!
Comments
Please login to add a commentAdd a comment