T20 World Cup 2021: Team India Playing Volleyball In Beach Video Goes Viral - Sakshi
Sakshi News home page

T20 World Cup 2021 Ind Vs Nz: బీచ్‌ వాలీబాల్‌ ఆడుతున్న టీమిండియా క్రికెటర్లు.. వీడియో వైరల్‌

Published Sat, Oct 30 2021 9:09 AM | Last Updated on Sat, Oct 30 2021 12:04 PM

T20 World Cup 2021: Team India Players Enjoy At Beach Ahead New Zealand Match - Sakshi

PC: BCCI

Team India unwind by playing beach volleyball Video Goes Viral: టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో భాగంగా ఆదివారం టీమిండియా కీలక మ్యాచ్‌ ఆడనుంది. సెమీస్‌ రేసులో నిలవాలంటే అక్టోబరు 31న న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పక విజయం సాధించాలన్న కసితో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న భారత క్రికెటర్లు.. శుక్రవారం కాస్త సేద తీరారు.  బీచ్‌ వాలీబాల్‌ ఆడుతూ... విరామ సమయాన్ని ఆస్వాదించారు.

ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది కోహ్లి సేనకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతుండగా... మరికొందరు మాత్రం కివీస్‌తో మ్యాచ్‌లో ఈసారైనా గెలుస్తారా లేదా అంటూ వ్యంగ్య ధోరణిలో స్పందిస్తున్నారు.

కాగా న్యూజిలాండ్‌తో జరిగిన గత ఐసీసీ టోర్నీల్లో టీమిండియాకు చేదు అనుభవాలు ఎదురైన సంగతి తెలిసిందే. 2007 టీ20 ప్రపంచకప్‌, 2016 టీ20 వరల్డ్‌కప్‌, 2019 వన్డే ప్రపంచకప్‌, ఇటీవలి, మొట్టమొదటి వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌లలో కివీస్‌ చేతిలో భారత జట్టు ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఈ సెంటిమెంట్‌ పునరావృతం కాకూడదంటూ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. 

చదవండి: KL Rahul: ముంబై ఇండియన్స్‌కు ఆడనున్న కేఎల్‌ రాహుల్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement