Virat Kohli Can Take Revenge Against New Zeland After 2 Losses ICC Tourney.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 31(ఆదివారం) టీమిండియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఐసీసీ టోర్నీల్లో పాక్‌పై ఘనమైన రికార్డు కలిగి ఉన్న టీమిండియాకు న్యూజిలాండ్ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌పై టీమిండియా విజయం సాధించి 18 ఏళ్లవుతుంది. 2003 వన్డే ప్రపంచకప్‌లో సౌరవ్ గంగూలీ నేతృత్వంలో న్యూజిలాండ్‌పై చివరిసారిగా గెలిచిన టీమిండియా మళ్లీ విజయం అందుకోలేదు. 2007 టి20 ప్రపంచకప్, 2016 టి20 ప్రపంచకప్, 2019 వన్డే వరల్డ్‌కప్, ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ ఇలా ఫార్మాట్ ఏదైనా టీమిండియాకు పరాజయమే ఎదురైంది.
చదవండి: IND Vs NZ: కివీస్‌తో మ్యాచ్ క్వార్టర్ ఫైనల్స్.. టాస్ గెలువు కోహ్లి
ఇక ఐసీసీ టోర్నీలో చివరి రెండుసార్లు న్యూజిలాండ్ చేతిలో ఓటమి ఎదురైనప్పుడు టీమిండియాకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లి ఉన్నాడు. దీంతో కోహ్లికి న్యూజిలాండ్‌పై గెలవలేడనే మచ్చ ఉంది. ఈసారి కెప్టెన్‌గా కోహ్లి ఎలాగైనా కివీస్‌పై లెక్క సరిచేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. పైగా టి20 కెప్టెన్‌గా కోహ్లికి ఇదే చివరి టి20 ప్రపంచకప్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే పాక్‌పై ఓడినందుకు అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో కివీస్‌తో మ్యాచ్ టీమిండియాకు కీలకం కానుంది. మరి కోహ్లి సేన ఈసారి ఏం చేస్తుందో వేచి చూడాలి. ఇక ముఖాముఖి పోరులోనూ ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 18 మ్యాచ్‌లు జరగ్గా.. 9 సార్లు టీమిండియా, మరో తొమ్మిది సార్లు న్యూజిలాండ్ విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment