T20 World Cup 2022 WI Vs ZIM: West Indies Set 154 Runs Target To Zimbabwe - Sakshi
Sakshi News home page

T20 WC WI VS ZIM: డూ ఆర్‌ డై మ్యాచ్‌లో నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన విండీస్‌

Published Wed, Oct 19 2022 3:49 PM | Last Updated on Wed, Oct 19 2022 6:32 PM

T20 World Cup 2022: West Indies Set 154 Runs Target To Zimbabwe - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022 గ్రూప్‌-బి క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లో ఇవాళ వెస్డిండీస్‌-జింబాబ్వే జట్టు తలపడుతున్నాయి. విండీస్‌.. తమ తొలి మ్యాచ్‌లో పసికూన స్కాట్లాండ్‌ చేతిలో ఓడిపోవడంతో సూపర్‌-12కు చేరాలంటే ఆ జట్టు ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. జాన్సన్‌ చార్లెస్‌ (45), రోవ్‌మన్‌ పొవెల్‌ (28), అకీల్ హొసేన్‌ (23 నాటౌట్‌) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో సికందర్‌ రజా (3/19) విండీస్‌ను దారుణంగా దెబ్బకొట్టగా.. ముజరబానీ (2/38), సీన్‌ విలియమ్స్‌ (1/17) రజాకు సహకరించారు. 

ఇదే గ్రూప్‌లో ఇవాళ ఉదయం జరిగిన మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై ఐర్లాండ్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొంది, సూపర్‌ 12 ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా.. ఐర్లాండ్‌ మరో ఓవర్‌ మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఐర్లాండ్‌ ఆటగాడు కర్టిస్‌ క్యాంపర్‌ (32 బంతుల్లో 72 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), (2/9) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement