టీ20 వరల్డ్‌కప్ 2024లో ఇవాళ (జూన్ 10) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. గ్రూప్-డి నుంచి తొలి రెండు స్థానాల్లో ఉన్న సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ న్యూయార్క్ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.
ఈ వేదికపై నిన్న (జూన్ 9) భారత్, పాక్ హోరాహోరీగా తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ఆదిలో వరుణుడు అడ్డు తగిలినా ఆతర్వాత నిరాటంకంగా సాగింది. రసవ్తరతంగా సాగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. ఈ పిచ్‌పై ఇరు జట్ల పేసర్లు చెలరేగిపోయారు. ఫలితంగా ఇరు జట్ల బ్యాటర్లు ఒక్కో పరుగు కోసం కఠోరంగా శ్రమించారు.
ఈ పిచ్‌పై ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో ఏ జట్టు ఒక్కసారి కూడా 150 పరుగుల మార్కు దాటలేదు. దీన్ని బట్టి చూస్తే పిచ్ ఎంత కఠినంగా ఉందో అర్దమవుతుంది. ఇదే పిచ్‌పై ఇవాళ సౌతాఫ్రికా-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో కూడా పెద్ద స్కోర్లు నమోదయ్యే అవకాశాలు లేవని తెలుస్తుంది. ఇక్కడ బ్యాటర్లకు మరోసారి గడ్డు పరిస్థితులు తప్పవని అంచనా.
సౌతాఫ్రికాదే సంపూర్ణ ఆధిపత్యం
టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డులు పరిశీలిస్తే.. బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికాకు సంపూర్ణ ఆధిపత్యం కనిపిస్తుంది. మెగా టోర్నీల్లో ఇరు జట్లు ఇప్పటివరకు తలపడిన 3 సందర్భాల్లో సౌతాఫ్రికానే విజయం సాధించింది. ప్రస్తుత బలాబలాల ప్రకారం చూసినా సౌతాఫ్రికానే మరోసారి జయకేతనం ఎగురవేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment