టీ20 వరల్డ్‌కప్ 2024లో గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. నాలుగు గ్రూప్‌ల నుంచి మొత్తం ఎనిమిది జట్లు సూపర్-8 దశకు చేరుకున్నాయి. గ్రూప్-ఏ నుంచి భారత్, యూఎస్‌ఏ, గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా , ఇంగ్లండ్ , గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ , వెస్టిండీస్, గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా , బంగ్లాదేశ్ సూపర్-8లోకి ప్రవేశించాయి. నేటి (జూన్ 19) నుంచి సూపర్-8 దశ మ్యాచ్‌లు మొదలువుతాయి.
సూపర్-8లో భాగంగా ఇవాళ జరుగబోయే తొలి మ్యాచ్‌లో యూఎస్‌ఏ, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. గ్రూప్-2లో భాగంగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఆంటిగ్వా వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.
సౌతాఫ్రికా, యూఎస్‌ఏ జట్లు ఏ ఫార్మాట్‌లో అయినా తలపడటం ఇదే మొదటిసారి. గ్రూప్ దశలో సౌతాఫ్రికా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సూపర్-8కు చేరగా.. యూఎస్‌ఏ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి భారత్‌తో పాటు గ్రూప్-ఏ నుంచి సూపర్-8కు అర్హత సాధించింది.
ఆంటిగ్వాలో వాతావరణం విషయానికొస్తే.. ఆంటిగ్వాలో ఇవాల్టి వాతావరణం మ్యాచ్‌కు అనుకూలంగా ఉంటుంది. సాయంత్రం వేళ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. పూర్తి మ్యాచ్ సాధ్యపడేందుకు ఎలాంటి ఆటంకాలు ఉండవు.
పిచ్ విషయానికొస్తే.. ఆంటిగ్వాలోని పిచ్‌లు బౌలర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. గ్రూప్ దశలో ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో పసికూనలు నమీబియా, ఒమన్ 72, 47 పరుగులకు ఆలౌటయ్యాయి. ఆ మ్యాచ్‌ల్లో వారి ప్రత్యర్దులు బలమైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు.
తుది జట్లు (అంచనా)..
సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, కేశవ్ మహరాజ్, కగిసో రబడా, అన్రిచ్ నోర్ట్జే, ఒట్నీల్ బార్ట్‌మన్, తబ్రైజ్ షమ్సీ
యూఎస్‌ఏ: మోనాంక్ పటేల్ (కెప్టెన్), స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్, నితీష్ కుమార్, కోరీ అండర్సన్, హర్మీత్ సింగ్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, జస్దీప్ సింగ్, సౌరభ్ నేత్రావల్కర్, అలీ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment