
తాతకు దగ్గులు నేర్పడం అంటే ఇదేనేమో... ద క్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్ తెలుసుగా.... ప్రపంచ క్రికెట్‌లో తిరుగులేని బౌలర్లలో ఒకడు. వేసిన బంతి బుల్లెట్ లా దూసుకుపోవాల్సిందే..వికెట్ తీయాల్సిందే అన్నట్టుగా ఉంటుంది స్టెయిన్ బౌలింగ్. ఈ ప్రతిభే అతడికి అంతర్జాతీయ క్రికెట్‌లో 700 వికెట్లు తెచ్చిపెట్టింది కూడా. మరి.. ఇలాంటి బౌలర్‌కు ఓ కుర్రాడు బౌలింగ్ పాఠాలు చెబితే ఎలా ఉంటుంది? కిందనున్న వీడియో చూస్తే తెలుస్తుంది.
2021 ఆగస్టులో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్న స్టెయిన్ ప్రస్తుతం అమెరికా, వెస్టిండీస్‌లలోజరుగుతున్న టీ20 వరల్డ్‌కప్-2024లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల షాపింగ్ మాల్స్‌లలో ఏర్పాటు చేసే నెట్ క్రికెట్ స్టాల్ వద్దకు స్టెయిన్ చేరుకున్నాడు. అక్కడున్న కుర్రాడికేమో స్టెయిన్ ఎవరో తెలియదు. అతడి గొప్పతనమూ ఆ కుర్రాడికి తెలియలేదు. అందరు కస్టమర్ల మాదిరిగానే క్రికెట్ ఆడేందుకు వచ్చాడనుకున్నాడు. బంతి ఎలా పట్టుకోవాలన్న దగ్గరి నుంచి మోచేయి వంచకుండా బౌల్ ఎలా చేయాలన్న అంశం వరకూ చాలా ‘మెళకువ’లను నేర్పే ప్రయత్నం చేశాడు.
స్టెయిన్ కూడా ఏమీ తక్కువ తినలేదు. ఏమీ తెలియనట్లే అమాయకుడిలా.. ఆ కుర్రాడు చెప్పిన వాటికల్లా తలూపాడు.. బంతి విసిరే సమయంలో మోచేతిని వంచకూడదని, ఓసారి బౌన్స్ అయితే స్టంప్స్ వరకు వెళ్లాలని ఆ కుర్రాడు సూచించినా అలాగే సర్ అన్నంత పని చేసి బౌలింగ్ చేశాడు. తెగ కష్టపడతూ విసిరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో స్టెయిన్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అవతలి వ్యక్తికి తను ఎవరో చెప్పకుండా హుందాగా ప్రవర్తించాడని ప్రశంసిస్తున్నారు.
ఎన్నో ఘనతలు..
2004లో ఇంగ్లండ్ పై టెస్ట్ మ్యాచ్‌తో డేల్ స్టెయిన్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20 మ్యాచులు ఆడిన డేల్ స్టెయిన్.. మూడు ఫార్మాట్లలో కలిపి 699 వికెట్లు తీశాడు.
దక్షిణాఫ్రికా తరపున టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డు ఇప్పటికి స్టెయిన్ పేరిటే ఉంది. అంతేకాకుండా 2008 నుంచి 2014 వరకు ఏకంగా 263 వారాల పాటు టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెం1 బౌలర్ గా స్టెయిన్ కొనసాగాడు. భారత్‌తో 2010లో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో
2008లో ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఈ సఫారీ దిగ్గజం నిలిచాడు. అదే విధంగా 2013లో విజ్డన్ లీడింగ్ క్రికెటర్ అవార్డు అందుకున్నాడు. ఇక రిటైర్మెంట్ తర్వాత బౌలింగ్ కోచ్‌గా, కామెంటేటర్‌గా కొనసాగతున్నాడు.
చదవండి: T20 WC 2024: పాక్‌ను దెబ్బ కొట్టింది మనోళ్లే.. ఎవరీ నేత్రావల్కర్?
I haven’t laughed this hard in a long time. Imagine giving bowling tips to Dale Steyn 😂😂😂😂😂 pic.twitter.com/idqw2jvW5n
— simmi (@simmiareff) June 6, 2024