థామ‌స్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. క్వార్టర్స్‌కు భారత్‌ | Thomas Cup 2026: India Enters Quarterfinal Beat Australia 5-0 | Sakshi
Sakshi News home page

థామ‌స్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. క్వార్టర్స్‌కు భారత్‌

Apr 27 2026 5:30 PM | Updated on Apr 27 2026 5:39 PM

Thomas Cup 2026: India Enters Quarterfinal Beat Australia 5-0

ప్ర‌తిష్ఠాత్మ‌క థామ‌స్ క‌ప్‌లో భార‌త జ‌ట్టు క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. గ్రూప్‌-ఏలో భాగంగా సోమ‌వారం ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ 5-0తో విజ‌యం సాధించింది. ఇప్ప‌టికే కెనడాను 4-1తో మ‌ట్టిక‌రిపించిన భార‌త్ గ్రూప్‌-ఏలో టేబుల్ టాప‌ర్‌గా కొన‌సాగుతుంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు భార‌త్ ఒక మార్పుతో బ‌రిలోకి దిగింది. సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ స్థానంలో హెచ్ఎస్ ప్ర‌ణ‌య్ ఆడాడు.

తొలుత సింగిల్స్‌లో ల‌క్ష్య‌సేన్ 21-14, 21-16తో స్టీఫెన్ సామ్‌పై విజ‌యం సాధించాడు. ఆ త‌ర్వాత మ‌రో సింగిల్స్‌లో ఆయుశ్ శెట్టి 21-8, 21-6తో శ్రేయ్ ధండ్‌పై విజ‌యం సాధించ‌డంతో భార‌త్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ త‌ర్వాత డ‌బుల్స్‌లో సాత్విక్‌-చిరాగ్ జోడి 21-14, 21-16తో రిజ్కీ హిద‌య‌త్‌-జాక్ యూ జంట‌పై గెలుపొందింది. 

ఆ త‌ర్వాత రివ‌ర్స్ సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్ర‌ణ‌య్ 21-11, 21-17తో రిషి హొండా భూప‌తిని, డ‌బుల్స్‌లో హ‌రిహ‌ర‌న్‌-అర్జున్ జోడి 21-12, 21-10తో అండికా ర‌మ‌డియ‌న్‌-సామ్ జంట‌పై విజ‌యం సాధించ‌డంతో భార‌త్ 5-0తో స్ప‌ష్ట‌మైన ఆధిక్యంతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. 

ఇక బుధ‌వారం భార‌త్ త‌మ చివ‌రి లీగ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ చైనాతో త‌ల‌ప‌డ‌నుంది. గ‌త థామస్ క‌ప్‌లో చైనా చేతిలో ఓడిన‌ భార‌త్ క్వార్ట‌ర్స్‌కే ప‌రిమిత‌మైంది. అయితే ఈసారి మాత్రం టైటిల్ సాధించాల‌నే ధృడ నిశ్చ‌యంతో ఉంది.

చదవండి: వైభవ్ ఇదేం పని.. ఫొటోకు వంద రూపాయలా?

Advertisement
 
Advertisement
Advertisement