
టోక్యో: కరోనా వైరస్‌తో ఇప్పటికే ఒకసారి వాయిదా టోక్యో ఒలింపిక్స్ క్రీడలు ఈ ఏడాదైనా జరుగుతాయో లేదో అనుమానంగా మారింది. టోక్యోలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), టోక్యో ఆర్గనైజింగ్ కమిటీ మార్చి 25న టార్చ్ రిలేను ప్రేక్షకులు లేకుండానే మొదలు పెట్టాయి.
వచ్చే వారం టార్చ్ హిరోషిమా నగరానికి చేరుకోనుండగా... రిలేను జరపడం లేదంటూ నగర గవర్నర్ హిడెహికో యుజాకి ప్రకటించారు. కరోనా వల్ల జపాన్‌లోని చాలా చోట్ల మే 31 వరకు అత్యవసర పరిస్థితిని విధించారు. దాంతో హిరోషిమా నగర వీధుల్లో జరగాల్సిన రిలేను రద్దు చేస్తున్నట్లు యుజాకి తెలిపారు.
చదవండి: Tokyo Olympics: వారికి ఫైజర్, బయోఎన్‌టెక్ వ్యాక్సిన్లు