
వన్డే ప్రపంచకప్-2023కు ముందు ఆస్ట్రేలియా ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ గాయం కారణంగా టోర్నీ ఫస్ట్ హాఫ్‌కు దూరమయ్యాడు. సౌతాఫ్రికాతో నాలుగో వన్డే సందర్భంగా అతడి ఎడమ చెయ్యి ఫ్రాక్చర్ అయింది. దీంతో అతడు ప్రోటీస్ పర్యటన నుంచి స్వదేశానికి పయనమయ్యాడు.
అయితే అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు నెలరోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ మెగా టోర్నీకి హెడ్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆసీస్ హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కూడా దృవీకరించాడు.
"హెడ్ పూర్తిగా కోలుకోవడానికి కొంచెం సమయం పడుతోంది. అతడికి ఎటువంటి శస్త్రచికిత్స అవసరములేదని మా వైద్య బృదం నిర్ధారించింది. ఇది మాకు ఊరట కలిగించే ఆంశం. స్కానింగ్‌లో ఎడమ చేతి వేలి జాయింట్‌లో ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. వరల్డ్‌కప్ తొలి ఆర్ధబాగానికి హెడ్ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అతడు ప్రస్తుతం మా వైద్య బృందం పరిశీలనలో ఉన్నాడని" మెక్‌డొనాల్డ్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. హెడ్ ప్రపంచకప్‌తో పాటు భారత్‌తో వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. వరల్డ్‌కప్ సన్నహాకాల్లో భాగంగా మూడు వన్డేల సిరీస్‌లో భారత్-ఆస్ట్రేలియా తాడోపేడో తెల్చుకోనున్నాయి.
చదవండి: అంతా బానే ఉంది కానీ.. రోహిత్‌కు అసలు పరీక్ష అదే! అప్పట్లో కోహ్లి, ద్రవిడ్..: మాజీ క్రికెటర్ వార్నింగ్