Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్లేఆఫ్ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ జూలు విదిల్చింది. లక్నో సూపర్‌జెయింట్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో చెన్నై పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. అయితే సీఎస్‌కే విజయంలో ఉర్విల్ పాత్ర కీలకం. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఉర్విల్ పటేల్ లక్నో బౌలర్లను ఊచకోత కోశాడు.
కేవలం 8 బంతుల్లోనే 41 పరుగులు చేసిన ఉర్విల్ టీ20 క్రికెట్ చరిత్రలో వేగవంతమైన అర్థసెంచరీ సాధిస్తాడనిపించింది. కానీ ఆ తర్వాత రెండు బంతుల్లో సింగిల్స్ తీయడంతో 13 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ సాధించాడు. అయితే ఉర్విల్ ఫిఫ్టీ మార్క్ చేరిన ఆనందంలో అతడి చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
A record knock 🤯
A memorable celebration with a 𝗵𝗲𝗮𝗿𝘁𝗳𝗲𝗹𝘁 𝗺𝗲𝘀𝘀𝗮𝗴𝗲 🥹🫶
Urvil Patel, thank you for the entertainment today 💛
Updates ▶️ https://t.co/MoXhlWHk4O#TATAIPL | #KhelBindaas | #CSKvLSG | @ChennaiIPL pic.twitter.com/GjR5D2sYid— IndianPremierLeague (@IPL) May 10, 2026
హాఫ్ సెంచరీ మార్క్ అందుకోగానే ఉర్విల్ తన ప్యాంటు జేబులో నుంచి ఒక కాగితాన్ని బయటకు తీశాడు. ఆ కాగితంలో ఉన్న సందేశాన్ని అభిమానులకు చూపించాడు. అందులో 'ఇది నీకోసం పప్పా' అని రాసి ఉన్న మెసేజ్ కెమెరా కంటికి చిక్కింది.
👉 ఇదే మ్యాచ్‌లో ఉర్విల్ పటేల్ మరో రికార్డు కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఉర్విల్ తాను ఎదుర్కొన్న తొలి 8 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఒక బౌండరీ బాదాడు. తద్వారా ఒక ఇన్నింగ్స్‌లో తొలి 8 బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్‌గా ఉర్విల్ నిలిచాడు. అంతకముందు ఐపీఎల్‌లో తొలి 8 బంతుల్లో 33 పరుగులు రావడమే ఉత్తమంగా ఉంది. తాజాగా ఉర్విల్‌పటేల్ దానిని బద్దలు కొట్టాడు.
6️⃣6️⃣6️⃣6️⃣6️⃣4️⃣6️⃣❗🔥
Urvil Patel is unleashing absolute carnage at Chepauk! 💥🏏
Will he script the fastest fifty in #TATAIPL? 👀🔥#TATAIPL Revenge Week 2026 ➡️ #CSKvLSG | LIVE NOW 👉 https://t.co/niGR0vFDDY pic.twitter.com/86xCo1SXsh— Star Sports (@StarSportsIndia) May 10, 2026
👉 సీఎస్‌కే తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన జాబితాలో ఉర్విల్ రెండో స్థానంలో నిలిచాడు. లక్నోతో మ్యాచ్‌లో ఉర్విల్ 282.6 స్ట్రైక్‌రేట్ 23 బంతుల్లో 65 పరుగులు సాధించాడు. తొలి స్థానంలో సురేశ్ రైనా (348 స్ట్రైక్‌రేట్, 25 బంతుల్లో 87 పరుగులు) ఉన్నాడు. అంబటి రాయుడు (266.6 స్ట్రైక్‌రేట్, 27 బంతుల్లో 72 నాటౌట్), ఎంఎస్ ధోని (255 స్ట్రైక్‌రేట్, 20 బంతుల్లో 51 నాటౌట్), డెవాల్డ్ బ్రెవిస్ (247.82 స్ట్రైక్‌రేట్, 23 బంతుల్లో 57 పరుగులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
👉 మ్యాచ్ విజయం అనంతరం ఉర్విల్ మాట్లాడుతూ.. ‘నా మనసులో ఏమీ లేదు, కానీ నేను పరిస్థితికి తగినట్లుగా బ్యాటింగ్ చేయాలని భావించాను. స్థిరమైన బేస్ ఉంచుకుని బ్యాటింగ్ ఆడమని కోచ్ సలహా ఇచ్చారు. నేను అదే పాటించాను. వికెట్ పల్లంగా ఉందని, దానికి సిద్ధంగా ఉండమని రుతురాజ్ చెప్పాడు. ఇది మినహా నాకు ఏమీ చెప్పలేదు. నన్ను స్వేచ్ఛగా ఆడనిచ్చాడు. అందుకే ఇది సాధ్యమైంది’ అని చెప్పుకొచ్చాడు.
చదవండి: వైభవ్‌పై రబాడ సంచలన వ్యాఖ్యలు


