భారీగా యూఎస్ ఓపెన్ ప్రైజ్‌మ‌నీ.. సింగిల్స్ విజేతకు 52 కోట్లు | US Open 2026 Prize Money Hits ₹1,034 Crore, Singles Winners To Earn Record ₹52.66 Crore, Check More Details | Sakshi
Sakshi News home page

భారీగా యూఎస్ ఓపెన్ ప్రైజ్‌మ‌నీ.. సింగిల్స్ విజేతకు 52 కోట్లు

Aug 21 2026 8:44 AM | Updated on Aug 21 2026 10:06 AM

US Open-2026 Singles Champions Earn Above-50-Crores-Prize Money

Photo Credit: Twitter

టెన్నిస్‌ సీజన్‌ చివరి గ్రాండ్‌ స్లామ్‌ యూఎస్‌ ఓపెన్‌ ప్రైజ్‌మనీ మరోసారి భారీగా పెరిగింది. ఓవరాల్‌ టోర్నీ ప్రైజ్‌మనీ భార‌త క‌రెన్సీలో సుమారు రూ. 1,034 కోట్లు (108 మిలియ‌న్ డాల‌ర్లు) కావ‌డం విశేషం. ఇక పురుషులు, మహిళల సింగిల్స్‌ విజేతలకు ఇచ్చే ప్రైజ్‌మనీని గతంతో పోలిస్తే 20 శాతం ఎక్కువకు పెంచారు. 2024 నుంచి చూసుకుంటే యూఎస్ ఓపెన్ ప్రైజ్‌మనీ 44 శాతం అధికం కావడం విశేషం.  

నిరుడు యూఎస్ ఓపెన్‌లో పురుషుల, మహిళల సింగిల్స్‌లో చాంపియన్‌గా నిలిచిన ప్లేయర్లకు రూ. 43. 86 కోట్లు తీసుకోగా.. ఇక నుంచి విజేతకు రికార్డుస్థాయిలో రూ. 52.66 కోట్లు (5.5 మిలియన్‌ డాలర్లు) దక్కనుంది. రన్నరప్‌నకు రూ. 26.33 కోట్లు ( లభించనుంది. సెమీఫైనలిస్టులు రూ. 13.82 కోట్లు చొప్పున అందుకోనున్నారు. 

ఇక క్వార్టర్స్‌లో వెనుదిరిగిన ఆటగాళ్లు రూ. 7.46 కోట్ల చొప్పున అందుకోనున్నారు.  సింగిల్స్‌ మెయిన్ డ్రాకు ఎంపికైన 128 ఆటగాళ్లు రూ. కోటి చొప్పున అందుకోనున్నారు. ఇక పురుషుల, మహిళల, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో చాంపియన్లుగా నిలిచిన జోడీ రూ.9.57 కోట్లు (1 మిలియన్ డాలర్లు), రన్నరప్ జోడీ రూ. 4.78 కోట్లు (5,00,000 డాలర్లు), వీల్‌చైర్ చాంపియన్లు రూ. 99 లక్షల 48 వేలు అందుకోనున్నారు.

నాలుగు మేజర్‌ గ్రాండ్‌స్లామ్స్‌లో యూఎస్‌ ఓపెన్‌ ప్రైజ్‌మనీనే అధికం. సింగిల్స్‌ విజేతలకిచ్చే ప్రైజ్‌మనీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో రూ. 20 కోట్లు, ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రూ. 25 కోట్లు, వింబుల్డన్‌లో రూ. 35 కోట్లుగా ఉంది. ఇక 2026 ఏడాది చివ‌రి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన యూఎస్‌ ఓపెన్‌ ఈనెల 23 నుంచి సెప్టెంబ‌ర్ 13 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.

చదవండి: టీమిండియా, బంగ్లాదేశ్‌ ద్వైపాక్షిక సిరీస్ వాయిదా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement