ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న న్యూజిలాండ్-ఇంగ్లండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ షురూ కానుంది.
ఇక భారత తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
ఈ మ్యాచ్‌లో కోహ్లి బరిలోకి దిగితే.. నాలుగు వన్డే వరల్డ్‌కప్ టోర్నీలు ఆడిన ఐదో భారత ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, ధోని వంటి భారత క్రికెట్ దిగ్గజాల సరసన కోహ్లి చేరుతాడు. కోహ్లి ఇప్పటివరకు 2011, 2015, 2019 వన్డే ప్రపంచకప్‌లలో భారత జట్టు ప్రాతినిథ్యం వహించాడు.
ఇక ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తొలి స్ధానంలో ఉన్నాడు. సచిన్ తన కెరీర్‌లో ఏకంగా 6 వన్డే ప్రపంచకప్‌లలో భాగమయ్యాడు. అదేవిధంగా అత్యధిక ప్రపంచకప్ టోర్నీలో ఆడిన రికార్డును పాకిస్తాన్ దిగ్గజం జావేద్ మియాందాద్‌తో సంయుక్తంగా సచిన్ కలిగి ఉన్నాడు.
జావేద్ మియాందాద్ కూడా 6 వన్డే వరల్డ్‌కప్‌లలో భాగమయ్యాడు. వీరి తర్వాతి స్ధానంలో రికీ పాంటింగ్, మహేల జయవర్ధనే, జాక్వెస్ కలిస్ ఉన్నారు. వీరి ముగ్గురు ఐదు సార్లు వరల్డ్‌కప్‌లో తమ దేశానికి ప్రాతినిధ్యం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment