హైదరాబాద్: ‘‘మానసిక ప్రశాంతతకైనా.. శారీరక విశ్రాంతికైనా నిద్ర చాలా అవసరం. ముఖ్యంగా ప్రొఫెషనల్ అథ్లెట్లకు, క్రీడాకారుల భవిష్యత్ సజావుగా సాగడానికి సంపూర్ణమైన నిద్ర అతి ప్రామాణికం’’అని టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు. ‘‘ఫ్రొఫెషనల్ కేరీర్ అయినా, ప్రియమైనవారితోనైనా ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగించాలంటే సరిపడా నిద్ర చాలా అవసరం.
ఈ విషయంలో నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. తగినన్ని గంటలు విశ్రాంతి తీసుకోవడమే కాదు.. డీప్ స్లీప్ అంటే నాకిష్టం’’ అని పేర్కొన్నాడు. ఫిట్‌నెస్, నిద్రకు చాలా ప్రాముఖ్యతనిచ్చే విరాట్ కోహ్లీని ప్రముఖ స్లీప్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ‘డ్యూరోఫ్లెక్స్’ బ్రాండ్ అంబాసిడర్‌గా కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన సోమవారం హోటల్ తాజ్‌కృష్ణాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విరాట్ కోహ్లి నిద్ర, ఫిట్‌నెస్‌తో పాటు తన క్రికెట్ కేరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలపై మాట్లాడాడు.
నైట్ పార్టీకెళ్లా.. ఔటయ్యా..
‘‘నేను అండర్–19 ఆడుతున్నప్పుడు ఒక రోజు కోల్‌కతాలో నైట్ పార్టీకి వెళ్లాను. అది పూర్తి చేసుకుని వచ్చేసరికి తెల్లవారుజామున 6 గంటలైంది. 7 గంటలకు మ్యాచ్ మొదలైంది. కేవలం 20 నిమిషాలే నిద్రపోయిన నేను బ్యాటింగ్‌కు వెళ్లిన లంచ్‌లోపే ఔటయ్యాను.
అప్పుడు నిద్ర విలువ తెలిసొచ్చింది. నాకు 25 ఏళ్లు ఉన్నప్పటి నుంచి అనుకుంటా.. ఫిట్‌నెస్‌కు, నిద్రకు చాలా ప్రాముఖ్యతనిస్తున్నా. ఇక వన్డేలు లేదా టెస్ట్ క్రికెట్ ఆడుతున్నప్పుడు పగటిపూట నిద్రపోవడం సాధ్యం కాదు. రోజంతా నిద్రపోయే అవకాశం ఉండదు. ప్రస్తుతం నేను సాయంత్రం సమయంలో జరిగే 20– 20 ఆడుతున్నాను. కాబట్టి మధ్యాహ్నం నిద్రపోవడం ప్రారంభించాను, ఇది రీసెట్ లాంటిది.
ఈ కునుకుతో తాజాగా, ఎనర్జిటిక్ మారిపోతాను. ఈ అలవాటు ఎన్నో సార్లు గాయాలైనప్పుడు కూడా త్వరగా కోలుకునేలా చేసింది. ప్రశాంతమైన ఆరోగ్యం కోసం మెడిటేషన్ చేస్తాను. మ్యూజిక్ వింటాను. ఒత్తిడి నుంచి బయటపడటానికి ఇలాంటి విషయాలను జీవితంలో భాగంగా చేసుకున్నాను’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్-2023 సీజన్‌తో బిజీగా ఉన్నాడు.
చదవండి: ICC: హెల్మెట్ కచ్చితం.. ఫ్రీ హిట్‌కు బౌల్డయితే బ్యాటర్ తీసిన పరుగులు?
తండ్రి లాంటి వారు చనువుగా, ఏదో తెలిసీ తెలియక తాకితే అపార్థం చేసుకుంటారా?
Comments
Please login to add a commentAdd a comment