సీఎస్‌కే అంటే కోహ్లీకి పూన‌క‌మే! | Virat Kohli Ultimate Batting Record Against CSK In IPL History | Sakshi
Sakshi News home page

IPL 2026: సీఎస్‌కే అంటే కోహ్లీకి పూన‌క‌మే!

Apr 5 2026 2:00 PM | Updated on Apr 5 2026 3:37 PM

Virat Kohli Ultimate Batting Record Against CSK In IPL History

Photo Courtesy: IPL 2026

టీమిండియా సీనియ‌ర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో కొత్త‌గా నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. చేజింగ్ మాస్ట‌ర్‌, కింగ్ కోహ్లీ, విరాట్ కింగ్ వంటి బిరుదులు అత‌డి సొంతం. చేజింగ్‌లో కోహ్లీని కొట్టే మొన‌గాడు లేడంటే అతిశ‌యోక్తి కాదు. అది అంత‌ర్జాతీయ మ్యాచ్ అయినా, ఐపీఎల్ మ్యాచ్ అయినా చేజింగ్‌లో కోహ్లీ బరిలో ఉన్నాడంటే ఆ జ‌ట్టు గుండెల‌పై హాయిగా చేయి వేసుకొని నిద్ర‌పోతాయి. 

టీమిండియా త‌ర‌ఫున ఇలాంటి ఘ‌ట‌న‌లు కోకొల్ల‌లు. ఇక ఐపీఎల్‌లో 19 సీజ‌న్లుగా ఆర్సీబీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోహ్లీ చేజింగ్‌లో లెక్క‌లేనన్ని సార్లు గెలిపించాడు. అయితే ఐపీఎల్‌లో కూడా కోహ్లీకి ఒక ఫేవ‌రెట్ జ‌ట్టు ఉంది. ఆ జ‌ట్టు పేరు చెబితే చాలు బ్యాటింగ్‌లో పూన‌కం వ‌చ్చేస్తుంది. ఆ జ‌ట్టు పేరే చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే). 

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఆదివారం డ‌బుల్‌హెడర్‌లో భాగంగా ఇవాళ ఆర్సీబీ త‌మ హోంగ్రౌండ్‌లో సీఎస్‌కేతో త‌ల‌ప‌డ‌నుంది. తమ తొలి మ్యాచ్‌లో నెగ్గిన ఆర్సీబీ రెండో విజ‌యంపై క‌న్నేయ‌గా.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓట‌ముల‌తో ప‌ట్టిక‌లో చివ‌రి స్థానంలో ఉన్న సీఎస్‌కే ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి ఖాతా తెర‌వాల‌ని చూస్తోంది. 

కాగా సీఎస్‌కేపై కోహ్లీకి అదిరిపోయే రికార్డులున్నాయి. ఐపీఎల్‌లో సీఎస్‌కేతో 35 మ్యాచ్‌లాడిన కోహ్లీ 34 ఇన్నింగ్స్‌ల్లో 1146 ప‌రుగులు సాధించాడు.  చెన్నైపై అత్య‌ధిక స్కోరు 90 నాటౌట్‌గా ఉంది. ఇందులో 10 అర్థ‌సెంచ‌రీలున్నాయి. మ‌రో 14 ప‌రుగులు చేస్తే ఒకే జ‌ట్టుపై అత్య‌ధిక ప‌రుగులు సాధించిన బ్యాట‌ర్‌గా త‌న రికార్డును తానే బ‌ద్ద‌లుకొట్ట‌నున్నాడు. పంజాబ్ కింగ్స్‌పై కోహ్లీ 1159 ప‌రుగులు సాధించాడు.

చదవండి: ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు!

Advertisement
 
Advertisement
Advertisement