ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు! | Rain Threat For SRH Vs LSG Match In Hyderabad IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు!

Apr 5 2026 1:26 PM | Updated on Apr 5 2026 3:14 PM

Rain Threat For SRH Vs LSG Match In Hyderabad IPL 2026

ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ సొంతగడ్డపై లక్నో సూపర్‌జెయింట్స్‌తో తలపడనుంది. ఉప్పల్‌ వేదికగా జరగనున్న మ్యాచ్‌కు వర్షం అడ్డు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది. 

మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలుకానున్న మ్యాచ్‌ మధ్యలో వర్షం పడే చాన్స్‌ ఉంది. ఆట జరిగే సమయంలో 50 శాతం వర్షం పడే అవకాశాలున్నట్లు వెదర్‌ రిపోర్ట్‌ చూపిస్తోంది. ప్రస్తుతానికి ఎండ బాగానే కాస్తున్నప్పటికీ మ్యాచ్‌ సమయానికి వాతావరణం చల్లబడే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే మ్యాచ్‌కు సంబంధించి టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. 

ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో మ్యాచ్‌లో గెలిచి బోణీ చేసింది. మరోవైపు పంత్‌ సారథ్యంలోని లక్నో మాత్రం తొలి మ్యాచ్‌లో ఓడి ఇంకా బోణీ కోసం ఎదురుచూస్తోంది. పాయింట్ల పట్టికలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఐదో స్థానంలో ఉంటే.. లక్నో ఎనిమిదో స్థానంలో కొనసాగుతుంది. 

సొంతగడ్డపై భారీ విజయంతో ముందంజ వేయాలని ఎస్‌ఆర్‌హెచ్‌ భావిస్తుంటే.. లక్నో మాత్రం ఎలాగైనా ఉప్పల్‌లో గెలిచి ఖాతా తెరవాలని చూస్తోంది. ఇరుజట్లు ముఖాముఖి పోరులో ఆరుసార్లు తలపడితే లక్నో 4 విజయాలు.. ఎస్‌ఆర్‌హెచ్‌ రెండు విజయాలు సాధించాయి. గతేడాది ఇదే ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై లక్నో సూపర్‌జెయింట్స్‌ విజయం సాధించింది.

చదవండి: అత‌డిని వ‌దిలి సీఎస్‌కే త‌ప్పు చేసిందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement