ఐపీఎల్-2023లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 56 పరుగుల తేడాతో లక్నో పరాజయం పాలైంది. 228 పరుగల భారీ లక్క్ష్య ఛేదనలో లక్నోకు ఓపెనర్లు డికాక్, కైల్ మైర్స్ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. అయినప్పటికీ మిడిలార్డర్‌లో బ్యాటర్లు రాణించకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులకే లక్నో పరిమితమైంది.
ఇక లక్నో ఓటమిపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వాఖ్యలు చేశాడు. లక్నో తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగానే పరాజయం పాలైంది అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. దీపక్ హుడాకు బదులుగా మూడో స్థానంలో ఇన్-ఫామ్ బ్యాటర్‌ను పంపి ఉండాల్సిందని సెహ్వాగ్ తెలిపాడు. "10 ఓవర్లకు లక్నో కేవలం ఒక వికెట్ మాత్రమే నష్టపోయి 102 పరుగులతో పటిష్టంగా కన్పించారు.
ఇటువంటి స్థితిలో ఉన్న లక్నో ఇంత భారీ తేడాతో ఓడిపోతుందని అస్సలు ఊహించలేదు. మొదటి వికెట్ తర్వాత ఫామ్‌లో ఉన్న బ్యాటర్ రావల్సింది. పూరన్, మార్కస్ స్టోయినిస్, కెప్టెన్ కృనాల్ పాండ్యా వచ్చినా బాగుండేది. అదే విధంగా వారి ఆఖరి మ్యాచ్‌లో చెన్నైపై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఆయుష్ బదోని అయినా పంపాల్సింది. కానీ లక్నో మాత్రం వీరివ్వరూ కాకుండా దీపక్ హుడాను బ్యాటింగ్‌కు వచ్చాడు. అస్సలు హుడాను ఎందుకు పంపారో ఆర్ధం కావడం లేదు. అదే వాళ్ల కొంపముంచింది" అని క్రిక్‌బజ్‌తో సెహ్వాగ్ పేర్కొన్నాడు.
చదవండి: WTC FInal 2023: రుత్‌రాజ్ గైక్వాడ్‌కు బంపరాఫర్.. డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో!
Comments
Please login to add a commentAdd a comment