Sehwag Reply To Fans Ask Who Win T20 WC 2021.. టి20 ప్రపంచకప్ 2021 సంగ్రామం మొదలై అప్పుడే 10 రోజులు దాటింది. ఈ పది రోజుల్లో 19 మ్యాచ్‌లు జరగ్గా.. అందులో నాలుగు జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. వాటిలో పపువా న్యూ గినియా, ఒమన్, నెదర్లాండ్స్, ఐర్లాండ్ ఉన్నాయి. ఇక సూపర్ 12 దశలో పాకిస్తాన్ అదరగొడుతుంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మంచి విజయాలు అందుకున్న పాక్ సెమీస్ రేసుకు మరింత దగ్గరైంది. ఇక ఇంగ్లండ్ కూడా బంగ్లాదేశ్‌పై దూకుడు కనబరుస్తూ వరుసగా రెండో విజయం సాధించే పనిలో పడింది. ఇక దక్షిణాఫ్రికా, శ్రీలంక, అఫ్గనిస్తాన్ తలా ఒక విజయం సాధించి ముందంజలో ఉన్నాయి. టీమిండియా, న్యూజిలాండ్‌లు విజయాల ఖాతా తెరవలేదు.. ఇక వెస్టిండీస్ మాత్రం వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి సెమీస్ అవకాశాలు మరింత క్లిష్టం చేసుకుంది. ఇన్ని చిక్కుముడుల మధ్యలో ఐసీసీ టి20 ప్రపంచకప్ 2021ను ఎవరు గెలుస్తారంటూ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తడుముకోకుండా సమాధానమిచ్చాడు.
చదవండి: T20 WC 2021: అక్తర్‌కు ఘోర అవమానం.. లైవ్‌లో నుంచి వెళ్లిపోవాలన్న హోస్ట్
'నా దృష్టిలో ఇప్పటికీ టీమిండియానే ఫెవరెట్. ఈసారి కచ్చితంగా ప్రపంచకప్ సాధిస్తుంది. పాకిస్తాన్‌తో ఓడిపోయినంత మాత్రానా టీమిండియాకు ఒరిగేదేం లేదు. ఇక్కడి నుంచే టీమిండియా తన ఆటతీరును రుచి చూపిస్తుంది. ఆటను గెలిచినప్పటి కంటే ఓడినప్పుడు ఎక్కువ మద్దతు ఇస్తే అది జట్టుకు బూస్టప్ అవుతుంది. ఇప్పుడు టీమిండియా విషయంలో అదే జరుగుతుంది. కాబట్టి టి20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలుస్తుందని బలంగా నమ్ముతున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌ను అక్టోబర్ 31(ఆదివారం) న్యూజిలాండ్‌తో ఆడనుంది. కాగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
చదవండి: ENG Vs BAN: కన్‌ఫ్యూజ్ రనౌట్.. ఇంగ్లండ్ ఆటగాడి డ్యాన్స్
Comments
Please login to add a commentAdd a comment