Video Viral: England Barmy Army Stunned Batsman Outrageous Shot - Sakshi
Sakshi News home page

Viral Video: 'ఇదేం షాట్‌ భయ్యా.. మతిపోయింది'

Published Sat, Jan 22 2022 2:43 PM | Last Updated on Sat, Jan 22 2022 3:50 PM

Watch Video England Barmy Army Stunned Batsman Outrageous Shot Viral - Sakshi

England Barmy Army Batsman: క్రికెట్‌ పుస్తకాల్లో కొన్ని వింత షాట్లు ఉంటాయి. ధోని కొట్టే హెలికాప్టర్‌ షాట్‌కు సెపరేట్‌ ఫ్యాన్‌బేస్‌ ఉంటుంది. అలాగే పంత్‌ రివర్స్‌స్వీప్‌.. మ్యాక్స్‌వెల్‌ స్విచ్‌హిట్‌.. ఇలా చెప్పుకుంటే పోతే ఒక్కో ఆటగాడికి ఒక్కో ప్రత్యేకమైన షాట్‌ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకునే వ్యక్తి కొట్టే షాట్‌ చూస్తే మీ మతి పోవడం ఖాయం. క్రీజులో ఉన్న రైట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మన్‌ బంతి పడిందే ఆలస్యం.. కేవలం తన ఎడమచేతిని ఉపయోగించి కాళ్ల వెనుక నుంచి లెగ్‌సైడ్‌ దిశగా కళ్లు చెదిరే సిక్స్‌ కొట్టాడు.

చదవండి: Andre Rusell: రసెల్‌తో ఆడుకున్న 'విధి'.. క్రికెట్ చరిత్రలో మిగిలిపోవడం ఖాయం

అసలు బంతి ఎటు వెళ్తుందో కూడా కనీసం పట్టించుకోలేదంటే అతని టైమింగ్‌ ఎంత కచ్చితంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఈ వీడియోనూ ఇంగ్లండ్‌ ఆర్మీ బార్మీ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ''అసలు ఏంటి ఆ షాట్‌.. దిమ్మతిరిగింది'' అన్నట్లుగా క్యాప్షన్‌తో పాటు ఎమోజీని జత చేసింది. ఈ వీడియో చూసిన కొందరు టీమిండియా అభిమానులు.. పంత్‌ ప్రయత్నిస్తే ఇలాంటి షాట్లు కొట్టగలడు.. అందునా ఇంగ్లండ్‌ టాప్‌ బౌలర్లైన జేమ్స్‌ అండర్సన్‌, జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో కొడితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అని కామెంట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement