ఆసియాకప్-2023లో సూపర్-4 బెర్త్‌ను టీమిండియా ఖాయం చేసుకుంది. ఈ టోర్నీలో భాగంగా సోమవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు.. సూపర్-4లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్, ఫీల్డింగ్ పరంగా టీమిండియా తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది.
కానీ బ్యాటింగ్‌లో మాత్రం భారత్ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 230 పరుగులకు ఆలౌటైంది. అయితే వర్షం కారణంగా భారత లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 పరుగులుగా నిర్దేశించారు. టీమిండియా 20.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 147 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ఇరగదీశారు.
రోహిత్ శర్మ (59 బంతుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (62 బంతుల్లో 67 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) కలిసి అజేయంగా జట్టును గెలిపించారు. ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రోహిత్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ సందర్భంగా పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ మాట్లాడుతూ.. "నిజంగా నా బ్యాటింగ్ మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డాను. కానీ ఎప్పుడైతే నా రిథమ్‌ను అందుకున్నానో ఆఖరివరకు ఉండి మ్యాచ్‌ను ఫినిష్ చేయాలనుకున్నాను. ఏది ఏమైనప్పటికీ మంచి ఇన్నింగ్స్ ఆడటం చాలా సంతోషంగా ఉంది. నేను ఆ ఫ్లిక్ స్వీప్ షాట్‌ను ఉద్దేశపూర్వకంగా ఆడలేదు. షార్ట్ ఫైన్ దిశగా ఆడాలనుకునున్నాను.
కానీ బ్యాట్ పవర్‌కు బౌండరీ దాటింది. మేము ఈ టోర్నీలో రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడాము. లక్కీగా తొలి మ్యాచ్‌లో మాకు పూర్తిగా బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. టాపర్డర్ విఫలమైనప్పటికీ హార్దిక్, ఇషాన్‌లు అద్భుతంగా రాణించారు. ఇక ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండూ చేశాం. ఇంకా మేము చాలా కష్టపడాల్సి ఉంది.
మా బాయ్స్ చాలా మంది గాయాల నుంచి కోలుకుని తిరిగి వచ్చారు. వారు గాడిలో పడడానికి కొంత సమయం అవసరం. ఇక ఈ మ్యాచ్‌లో మా ఫీల్డింగ్ నన్ను చాలా నిరాశపరిచింది. అది క్షమించరానిది. ఈ విభాగంలో మేము ఇంకా చాలా మెరుపడాలి.ఇక ప్రపంచకప్ జట్టు ఓ క్లారిటీతోనే శ్రీలంకకు వచ్చాం. ఎందుకంటే ఆసియాకప్‌లోని రెండు మ్యాచ్‌లతో ప్రపంచకప్ జట్టును సెలక్టర్లు ఎంపిక చేయలేరు కదా. ఈ మెగా టోర్నీ కోసం సెలక్టర్లు ఇప్పటికే జట్టును ఫైనల్ చేశారు అని పేర్కొన్నాడు.
చదవండి: Asia Cup 2023: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. తొలి భారత ఆటగాడిగా! సచిన్ రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment