
జాగ్రెబ్ (క్రొయేషియా): కొత్త ఏడాదిని భారత రైజింగ్ స్టార్ రెజ్లర్ అమన్ సెహ్రావత్ స్వర్ణ పతకంతో ప్రారంభించాడు. జాగ్రెబ్ ఓపెన్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నీలో అమన్ 57 కేజీల విభాగంలో చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో అమన్ 4 నిమిషాల 21 సెకన్లలో 10–0తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో చైనా రెజ్లర్ జౌ వాన్‌హావోపై గెలుపొందాడు. ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం వచ్చిన వెంటనే రిఫరీ బౌట్‌ను నిలిపివేసి ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా ప్రకటిస్తారు.
అమన్ తాను పోటీపడిన నాలుగు బౌట్‌లలోనూ ప్రత్యర్థులను ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలోనే ఓడించడం విశేషం. తొలి రౌండ్‌లో అమన్ 15–4తో కరావుస్ (తుర్కియే)పై, క్వార్టర్ ఫైనల్లో 11–0తో రిచర్డ్స్ రోడ్స్ (అమెరికా)పై, సెమీఫైనల్లో 11–0తో రొబెర్టి డాంగాషి్వలి (జార్జియా)పై విజయం సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment