టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాపై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒత్తిడిని సవాల్‌గా తీసుకుంటాడని జహీర్ కొనియాడాడు. రాజ్‌కోట్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో భారత్ 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆరంభంలోనే వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన టీమిండియాను హార్ధిక్ పాండ్యా అదుకున్నాడు. 31 బంతుల్లో హార్ధిక్ 46 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దినేష్ కార్తీక్‌తో కలిసి ఐదో వికెట్‌కు 65 పరుగుల కీలక బాగాస్వామ్యాన్ని నమోదు చేశాడు.ఇక దినేష్ కార్తీక్ 27 బంతుల్లోనే 55 పరుగులు చేసి భారత్ 169 పరుగుల చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
"హార్ధిక్ తను ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. అతడు బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు చేయాలని కోరుకుంటున్నాను. హార్ధిక్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ వస్తే మరింత అద్భుతంగా రాణిస్తాడు. ఆరంభంలో వికెట్లు కోల్పోయినప్పడు, అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి. ఐపీఎల్‌లో కూడా ఆ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుతంగా రాణించాడు. అతడు అటువంటి ఒత్తిడి పరిస్థితులను ఛాలెంజ్‌గా తీసుకుని ఆడుతాడు. అదే అతడి బ్యాటింగ్ స్టైల్" అని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు.
చదవండి: ENG vs NED: నెదర్లాండ్స్ ఆటగాళ్ల గోస .. బంతి కోసం చెట్లు, పుట్టల్లోకి
Comments
Please login to add a commentAdd a comment