మలివయసులో ఆదరణ కరువై..
● మనస్తాపంతో వృద్ధురాలి ఆత్మహత్య
సీతారామపురం: వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని పడమటి రొంపిదొడ్లలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. ముటుకుందు చెన్నమ్మ (75) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబసభ్యుల ఆదరణ కరువవడంతో జీవితంపై విరక్తి చెంది ఊరి బయటకెళ్లి పురుగుల మందు సేవించి పడిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. 108లో ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే చెన్నమ్మ మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జోయాలుక్కాస్‌లో
50 శాతం ఆఫర్లు
నెల్లూరు(బృందావనం): అన్నమయ్య సర్కిల్ సమీపంలోని జోయాలుక్కాస్ జ్యూవెలరీ షోరూమ్ ప్రథమ వార్షికోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. కేక్‌ను కట్ చేసిన అనంతరం 50 శాతం ఆఫర్ల బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ నెల్లూరు బ్రాంచ్ మేనేజర్ అక్రమ్ అహ్మద్, అసిస్టెంట్ మేనేజర్ ప్రశాంత్ మాట్లాడారు. మాఘమాసం, పెళ్లిళ్ల సీజన్‌ను పురస్కరించుకొని గోల్డ్, డైమండ్ జ్యువెలరీ, అన్‌కట్ డైమండ్స్, ప్లాటినమ్, సిల్వర్ ఆభరణాలపై మజూరీ చార్జీల్లో 50 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశం మార్చి ఏడు వరకే అందుబాటులో ఉంటుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment