డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ కోవూరు నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్న కొందరు నేతలు నీచ స్థితికి దిగజారిపోయారు. ఇప్పటికే సహజ వనరులతోపాటు పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని దోచుకుంటూ జేబులు నింపుకుంటున్న వీరు పర్యావరణాన్ని కలుషితం చేస్తూ చేపలకు చికెన్ వేస్ట్ సరఫరా చేస్తున్నారు. తాజాగా పశువులను కబేళాలకు పంపిస్తూ కమీషన్లు దండుకునే నీచ స్థాయికి దిగజారిపోయారు. పంచాయతీ పాలకవర్గం తీర్మానం లేకుండానే ఆగమేఘాల మీద పంచాయతీ కార్యదర్శి అనుమతలు మంజూరు చేయడం చూస్తే ఏ స్థాయిలో సొమ్ములు చేతులు మారాయో అర్థమవుతోంది.
● పంచాయతీ పాలకవర్గ తీర్మానం లేకుండానే సంత నిర్వహణకు అనుమతి
● కోవూరు, పడుగుపాడు, రేగడిచెలికల్లో పశువుల సంతల నిర్వహణ
● రూ.లక్షల్లో చేతులు మారడంతో
సంతలకు అనుమతి
● కోవూరులో బరితెగించిన
షాడో ఎమ్మెల్యేలు
Comments
Please login to add a commentAdd a comment