ఆత్మకూరు అభివృద్ధికి పరితపించి..
ఆత్మకూరు: మేకపాటి గౌతమ్‌రెడ్డి.. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతగానో పరితపించిన నాయకుడు. రాజకీయాల్లోకి వచ్చిన తొలిరోజుల్లో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. సాధారణంగా రాజకీయాల్లో పార్టీల మధ్య విభేదాలతో ఒకరంటే ఒకరు పడని పరిస్థితులుంటాయి. కానీ దానికి భిన్నంగా గౌతమ్‌రెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసి అజాతశత్రువుగా పేరు పొందారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అటు అధికార, ఇటు ప్రతిపక్ష నాయకుల మన్ననలు పొందిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
అనేక పనులు
గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో నారంపేట ఇండస్ట్రియల్ పార్కు తీసుకొచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేశారు. అప్పటి జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి హైలెవల్ కెనాల్ రెండో ఫేజ్ పనులు ప్రారంభించారు. ఆత్మకూరు మున్సిపల్ ప్రజలకు సోమశిల జలాలను తాగునీటిగా అందించేందుకు ఎంజీఆర్ – అదానీ వాటర్ ప్లాంట్‌ను ఒకటో వార్డులో నెలకొల్పారు. దీని ద్వారా సుమారు 13 వార్డుల్లో ప్రజలకు నీరందుతోంది. జాబ్‌మేళాలు పెట్టి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించారు. ఎంజీఆర్ హెల్ప్‌లైన్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. గౌతమ్‌రెడ్డి 2022 ఫిబ్రవరి 21వ తేదీన ఆకస్మికంగా మృతిచెందారు. ఈ విషయాన్ని నాయకులు, ప్రజలు జీర్ణించుకోలేకపోయారు.
రాజకీయాల్లో అజాతశత్రువు
మేకపాటి గౌతమ్‌రెడ్డి
నాడు మంత్రిగా నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి
నేడు ఆయన వర్ధంతి
ఆత్మకూరు అభివృద్ధికి పరితపించి..
Comments
Please login to add a commentAdd a comment