నృసింహుని హుండీల రాబడి రూ.93 లక్షలు
రాపూరు: పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని హుండీల కానుకలను శ్రీవారి క్రేన్ మండపంలో గురువారం లెక్కించారు. ఈ సందర్భంగా డీసీ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ 77 రోజులకు గానూ రూ.93,28,696 వచ్చిందన్నారు. బంగారం 220 గ్రాములు, వెండి 3.50 కేజీలు వచ్చినట్లు చెప్పారు. పలు దేశాల విదేశీ నాణేలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు సీతారామయ్యస్వామి, జిల్లా దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
సర్వేపల్లి కాలువలో మహిళ మృతదేహం
వెంకటాచలం: గుర్తుతెలియని మహిళ మృతదేహం సర్వేపల్లి కాలువలో కొట్టుకుపోతుండగా మండలంలోని గొలగమూడి సమీపంలో స్థానికులు గురువారం సాయంత్రం గుర్తించారు. వివరాలు.. గ్రామానికి చెందిన కొందరు రైతులు గేదెల కోసం పొలాల వద్దకు వెళ్లగా సర్వేపల్లి కాలువలో సుమారు 35 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని మహిళ మృతదేహం కొట్టుకుపోతుండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు గ్రామానికి వచ్చే సరికి చీకటి పడటంతో మృతదేహం ఆచూకీ తెలియలేదు. మహిళ ప్రమాదవశాత్తు కాలువలో పడిందా, లేక ఆత్మహత్య చేసుకుందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment