చేపలు పట్టేందుకు వెళ్లి..
● వ్యక్తి మృత్యువాత
నెల్లూరు(క్రైమ్): చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన నెల్లూరులోని బారాషహీద్ దర్గా సమీపంలో నెల్లూరు చెరువులో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలం కొత్తూరు అంబాపురానికి చెందిన కె.కోటయ్య (50), కామేశ్వరమ్మ దంపతులకు ఐదుగురు పిల్లలున్నారు. కోటయ్య నెల్లూరు చెరువులో చేపలు పట్టుకుని వాటిని విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకోసాగాడు. అతను గురువారం బారాషహీద్ దర్గా సమీపంలోని చెరువులో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతిచెందాడు. ఈ విషయాన్ని గమనించిన అక్కడున్నవారు 112కు సమాచారం అందించారు. దర్గామిట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. భర్త మృతి విషయం తెలుసుకున్న కామేశ్వరమ్మ తన పిల్లలతో కలిసి ఘటనా స్థలానికి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు దర్గామిట్ట ఎస్సై రమేష్‌బాబు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment