
విద్యుదుత్పత్తి కేంద్రాలుగా గృహాలు
నెల్లూరు(పొగతోట): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూర్యఘర్ పథకం ద్వారా ప్రతి ఇంటిని విద్యుదుత్పత్తి కేంద్రంగా మార్చాలని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. నెల్లూరులోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్ ఆనంద్‌తో కలిసి ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. దీనికి శాసనసభ్యులు ఎవరూ హాజరుకాలేదు. అధికారులు మాత్రమే వచ్చారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ మర్యాదపూర్వకంగా చైర్మన్‌ను కలిశారు. సమీక్ష అనంతరం దినకర్ మీడియాతో మాట్లాడారు. ఉపాధి హామీ, జల్‌జీవన్ మిషన్, అమృత్ పథకం తదితర అంశాలపై సమీక్షించామన్నారు. సత్ఫలితాలను సాధించేలా అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చామన్నారు. జిల్లాను ఎలక్ట్రానిక్ హబ్‌గా, వస్తువులు తయారీ కేంద్రంగా మార్చడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు ఇక్కడ అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. రామాయపట్నం పోర్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
అవగాహన లేకుండానే..
అధికారుల సమీక్షలో దినకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్ణయాల వల్ల ఉపాధి హామీకి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రూ.2,300 కోట్లకు పైగా మెటీరియల్ కాంపోనెంట్ నిధులను నష్టపోవడం జరిగిందన్నారు. వాస్తవానికి ఉపాధి పనులకు సంబంధించి మెటీరియల్ కాంపోనెంట్ నిధులు ముందుగా మంజూరు కావు. ఒక జిల్లాను యూనిట్ తీసుకుంటారు. ఉదాహరణకు రూ.200 కోట్ల విలువైన పనులు జరిగితే రూ.80 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ నిధులు మంజూరవుతాయి. మిగతా మొత్తం కూలీలు చేసే పనులకు సంబంధించి ఇస్తారు. కలెక్టర్లు జిల్లాలో కూలీలు చేసే పనులను పరిశీలించి మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా సీసీ రోడ్లు, ఇతర భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తారు. ఈ విషయంపై అవగాహన లేని చైర్మన్ రూ.2 వేల కోట్లకు పైగా నిధులు నష్టపోయామని చెప్పడం విడ్డూరంగా ఉంది.
జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి
అవకాశాలు
20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్
Comments
Please login to add a commentAdd a comment