అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం
నెల్లూరు (లీగల్): నెల్లూరు ఫ్యామిలీ కోర్టు కమ్ 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఏపీపీగా సీనియర్ న్యాయవాది మద్దిబోయిన సుందరయ్య, బాలలపై లైంగికక దాడుల విచారణ ప్రత్యేక కోర్టు (పోక్సో) ఏపీపీగా దూబిశెట్టి చంద్రశేఖర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడేళ్ల పాటు ఏపీపీలుగా కొనసాగుతారు.
రైతులకు
యూనీక్ కోడ్ అవసరం
నెల్లూరు(సెంట్రల్): రైతులకు యూనీక్ కోడ్ అవసరమని, అందుకు సంబంధించి ఈ నెల 28వ తేదీ వరకు గడువు ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సత్యవాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1.71 లక్షల మంది పీఎం కిసాన్ రైతులు ఉన్నారని, ఇప్పటి వరకు లక్ష మందికిపైగా రైతులకు యూనిక్ కోడ్ కేటాయించామన్నారు. మిగిలిన దాదాపు 71 వేల మంది రైతులు యూనీక్ కోడ్ నంబర్ పొందాల్సి ఉందన్నారు. గ్రామాల్లోకి వ్యవసాయ శాఖ అధికారులు వచ్చినప్పుడు, లేక రైతు సేవా కేంద్రాల్లో యూనీక్ కోడ్ నంబర్ తీసుకోవాలని కోరారు. ఈ కోడ్ ఉంటేనే ప్రభుత్వం నుంచి వచ్చే వ్యవసాయ పథకాలు అందుతాయని తెలిపారు.
28 లోపు
దరఖాస్తు చేసుకోవాలి
నెల్లూరు (టౌన్): జిల్లాలో 2025–26కు సంబంధించి అన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు అఫిలియేషన్ రెన్యువల్, అదనపు సెక్షన్లు, కోర్సులు, ద్వితీయ భాష, మీడియం, పేరు, మేనేజ్‌మెంట్ మార్పు, మూసివేత, లేదా పునః ప్రారంభం, ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదు విడుదలకు ఈ నెల 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆర్‌ఐఓ ఆదూరు శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటలో తెలిపారు. ఎఫ్‌డీఆర్ విడుదల, సొసైటీ, మేనేజ్‌మెంట్ మార్పు ఏడాదిలో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అవసరమైన ధ్రువపత్రాలు, నిర్ణీత ఫీజు, సంబంధిత ధరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించాలన్నారు. దరఖా స్తు చేసిన కళాశాలలను తనిఖీ కమిటీలు సందర్శించి అందజేసిన నివేదిక ఆధారంగా బోర్డు అదనపు సెక్షన్లను అమలు చేస్తుందన్నారు. ఇతర వివరాల కోసం జిల్లా ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
వన్యప్రాణులను
వేటాడితే కఠిన చర్యలు
బిట్రగుంట: బోగోలు మండలం తాళ్లూరు, కొత్తూరు, వెస్ట్రన్ కాలనీ, రామస్వామిపాళెం తదితర ప్రాంతాలకు సమీపంలోని అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట సాగుతోందనే సమాచారంతో అటవీశాఖ అధికారులు మంగళవారం వేకువన విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కొత్తూరు, రామస్వామిపాళెం, తాళ్లూరుకు సమీపంలోని అటవీ ప్రాంతాల్లో జింకలు, అడవి పందుల సంచారం ఎక్కువగా ఉండడంతో కొంత మంది ఉచ్చులు ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో వేట సాగిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల గౌరవరం కేంద్రంగా జింక మాంసం కూడా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. కొత్తూరుకు సమీపంలోని పొలాల్లో కొంత మంది రైతులు అడవి పందులు పంటలు పాడు చేయకుండా ఉండేందుకు విద్యుత్ తీగలు అమర్చి ఉండడాన్ని గుర్తించి సంబంధిత రైతులను అధికారులు మందలించారు. విద్యుత్ తీగల కారణంగా వన్యప్రాణులతో పా టు మనుషుల ప్రాణాలకు కూడా ప్రమాదం వా టిల్లే అవకాశం ఉందని, మరోసారి ఇలాంటి చర్య లు పునరావృతమైతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అటవీశాఖ అధి కారి సుమన్,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి న్యాయవాదుల
కోర్టు విధుల బహిష్కరణ
నెల్లూరు (లీగల్): న్యాయవాదుల చట్టం – 1961కు సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అడ్వొకేట్ యాక్ట్ – 2025కు వ్యతిరేకంగా గురు, శుక్రవారాల్లో కోర్టు విధులను న్యాయవాదులు బహిష్కరించనున్నారని నెల్లూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమామహేశ్వర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుందరయ్యయాదవ్, జాయింట్ సెక్రటరీ వరప్రసాద్ మంగళవారం తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయవాదుల సమావేశ మందిరంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు సహకరించాలని కోరారు.
అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం
Comments
Please login to add a commentAdd a comment