
రైల్లో వెళ్తూ.. పెన్నానదిలో పడి..
● గుర్తుతెలియని వ్యక్తి మృతి
నెల్లూరు(క్రైమ్): కావలి వైపు వెళ్లే రైల్లో నుంచి పెన్నానదిలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం నెల్లూరులో పెన్నా బ్రిడ్జి వద్ద జరిగింది. మృతుడి వయసు సుమారు 30 నుంచి 35 ఏళ్లలోపు ఉంటుందని భావిస్తున్నారు. క్రీమ్ కలర్ ఫుల్ హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు నైట్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై జి.మాలకొండయ్య ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో నదిలో నుంచి మృతదేహాన్ని వెలికితీసి జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బంగారు హారం బహూకరణ
రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో ఉన్న ఆదిలక్ష్మీదేవికి బుధవారం బంగారు కాసులహారాన్ని దాతలు బహూకరించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం లింగాలవలస గ్రామానికి చెందిన గురుబెల్లి లక్ష్మీనారాయణ, చైతన్యలు 39 గ్రాముల బంగారు లక్ష్మీదేవి కాసులహారాన్ని అర్చకులు బాలాజీ స్వామికి అందించారన్నారు. కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు, ఆలయ సిబ్బంది వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.
సైబర్ నేరంపై
కేసు నమోదు
నెల్లూరు(క్రైమ్): ఓ వ్యక్తి క్రెడిట్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయగానే అతని బ్యాంక్ ఖాతాలోని రూ.3.17 లక్షల నగదును సైబర్ నేరగాళ్లు దోచేసిన ఘటనపై నెల్లూరు దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన డేవిడ్ పీటర్ ముత్తుకూరులోని ఓ పవర్ ప్లాంట్‌లో పనిచేస్తూ నెల్లూరు ఇస్కాన్ సిటీలోని శ్రీనివాస్ అపార్ట్‌మెంట్ పెంట్‌హౌస్‌లో నివాసం ఉంటున్నాడు. గతేడాది డిసెంబర్‌లో క్రెడిట్ కార్డు కోసం ఓ జాతీయ బ్యాంక్‌కు చెందిన వెబ్‌సైట్‌ను తెరిచి అందులో వివరాలు నమోదు చేశాడు. పాత క్రెడిట్ కార్డు వివరాలను ఇవ్వగా అతని బ్యాంకు ఖాతానుంచి పలు దఫాలుగా రూ.3,17,438 నగదు డ్రా అయినట్లు ఫోన్‌కు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో నిర్ఘాంతపోయిన బాధితుడు వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బాఽధితుడు బుధవారం దర్గామిట్ట పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ఎస్సై జీవీ సుబ్బారావు కేసు నమోదు చేశారు.
బ్యారేజ్ వద్ద
గుర్తుతెలియని మృతదేహం
పొదలకూరు: సంగం బ్యారేజ్ 50వ పిల్లర్ వద్ద గుర్తుతెలియని మృతదేహాన్ని బుధవారం పోలీసులు వెలికి తీయించారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. బ్యారేజ్ పిల్లర్ పక్కనే తేలియాడుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే ఎస్సై ఎస్‌కే హనీఫ్ అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైల్లో వెళ్తూ.. పెన్నానదిలో పడి..

రైల్లో వెళ్తూ.. పెన్నానదిలో పడి..
Comments
Please login to add a commentAdd a comment