సంగం: పెన్నానదిలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన మండలంలోని కోలగట్లలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. ఆత్మకూరుకు చెందిన గంగాధర్, ప్రసన్న దంపతుల రెండో కుమారుడు యశ్వంత్ (15) ప్రగతి స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. మహాశివరాత్రి పండగ సందర్భంగా పాఠశాలకు సెలవు ప్రకటించారు. దీంతో ఆత్మకూరు నుంచి యశ్వంత్, మరో ఏడుగురు విద్యార్థులు సరదాగా ఈత కొట్టేందుకు కోలగట్లకు వచ్చారు. నాగార్పమ్మ గుడి సమీపంలోని పెన్నానదిలోకి యశ్వంత్, ఐదుగురు ఈతకు వెళ్లగా ఇద్దరు గట్టుపై కూర్చున్నారు.
యశ్వంత్, మరొకరు సుమారు 500 మీటర్ల ముందుకు ఈదుతూ వెళ్లారు. ఒక్కసారిగా యశ్వంత్ నీటిలోకి మునిగిపోయాడు. అతడిని కాపాడేందుకు స్నేహితులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒడ్డుకు చేరుకున్న వారు సెల్‌ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. విద్యార్థులు ఆందోళన చెందుతుండటంతో గ్రామస్తులు సంగం ఎస్సై రాజేష్‌కు సమాచారం ఇచ్చి పెన్నానదిలో గాలింపు చేపట్టారు. యశ్వంత్‌ను బయటకు తీసి ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో మృతదేహాన్ని ఇంటికి తరలించారు. ఎస్సై తన సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. యశ్వంత్ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.

ప్రాణం తీసిన ఈత సరదా
Comments
Please login to add a commentAdd a comment