
డీవీసత్రంలో దొంగల హల్‌చల్
దొరవారిసత్రం: మండలంలోని దొరవారిసత్రం పరిధిలోని జాతీయ రహదారి వెంబడి ఉన్న వివిధ దుకాణాల వద్ద దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. మంగళవారం రాత్రి ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు తలకు టోపీ, ముఖం కనిపించకుండా రుమాలు, చేతికి గ్లౌజ్‌లు తొడుక్కున్న ఇద్దరు ఓ దుకాణంలో చోరీకి ప్రయత్నించారు. అక్కడ ఏర్పాటు చేసిన అలర్ట్ సైరన్ మోగడంతో దుండగులు మోటార్‌బైక్‌పై పరారయ్యారు. జాతీయ రహదారి వెంబడి ఉన్న పలువురి షాపుల్లో ఇటీవల వరుసగా చోరీలు జరుగుతున్నాయి. దీంతో యజమానులు భయాందోళన చెందుతున్నారు. మూడు రోజుల క్రితం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఒక వ్యక్తి బైక్‌ను చోరీ చేశారు. గతంలోనూ అనేక బైక్‌లను ఎత్తుకెళ్లారు. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment