గిరిజన బాలికను గర్భవతిని చేసి మోసం
కావలి: మండలంలోని ఒక గ్రామానికి చెందిన గిరిజన బాలికను ఓ వ్యక్తి గర్భవతి చేసినట్లు బుధవారం కావలిరూరల్ పోలీసులకు ఫిర్యాదు అందింది. బాలికకు రుతుస్రావం ఆగిపోవడంతో కుటుంబ సభ్యులు పట్టణంలోని వైద్యశాలకు తీసుకొచ్చి పరీక్షలు చేయించారు. బాలిక గర్భం దాల్చినట్లు వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. ఇంటికి తీసుకెళ్లి బాలికను కుటుంబ సభ్యులు విచారించగా గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ చదివిన వ్యక్తి మాయమాటలు చెప్పి శారీరకంగా కలిసినట్లు వెల్లడించింది. దీంతో వారు కావలిరూరల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు అందజేశారు. అయితే బాధితురాలి కుటుంబ సభ్యులను రెండు రోజుల తర్వాత పోలీస్‌స్టేషన్‌కు రావాలని పోలీసులు పంపించేశారు. అయితే ఈ వ్యవహారంపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment