నెల్లూరు(క్రైమ్): ఓ వివాహిత ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలం కాకుపల్లికి చెందిన శేషసాయి పొదలకూరు మండలం మర్రిపల్లికి చెందిన శివప్రియ (26)లు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తొలుత కాకుపల్లిలో కాపురం పెట్టి మూడునెలల క్రితం ప్రశాంతినగర్‌కు వచ్చారు. వారికి నెలల వయసున్న కుమారుడున్నాడు. బాబు విషయంలో గురువారం దంపతుల నడుమ వాగ్వాదం జరిగింది. శేషసాయి పని నిమిత్తం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. సాయంత్రం ఆమె తన భర్తకు వాట్సాప్‌లో గుడ్‌బై అని మెసేజ్ చేసింది.
ఇది చూసిన భర్త వెంటనే ఆమెకు ఫోన్ కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో అతను జరిగిన విషయాన్ని తన ఇంటి యజమానికి తెలియజేయగా, వారు వెళ్లి కిటికీలో నుంచి చూశారు. అప్పటికే శివప్రియ ఉరేసుకుని ఉండటాన్ని గమనించి ఇదే విషయాన్ని భర్తకు తెలియజేశారు. అనంతరం అందరూ కలిసి ఇంటి తలుపులు పగులగొట్టి ఆమెను చికిత్స నిమిత్తం అపోలో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు భర్త నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్ అన్వర్‌బాషా హాస్పిటల్‌కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు నెల్లూరుకు బయలుదేరారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment