
హైస్కూల్లో 50 కుళాయిల చోరీ
● పది తలుపులు,
పది వాష్‌బేసిన్ల ధ్వంసం
కొడవలూరు: మండలంలోని యల్లాయపాళెం జెడ్పీ హైస్కూల్లో బుధవారం చోరీ జరిగింది. దుండగులు పది తలుపులు పగులగొట్టి బాలబాలికల మరుగుదొడ్లు, తాగునీటికి సంబంధించిన 50 స్టీల్ కుళాయిలను అపహరించారు. కుళాయిల కోసం పది వాష్‌బేసిన్లను పగులగొట్టారు. ఈ ఘటన సెలవు రోజైన బుధవారం మధ్యాహ్నం జరిగిందా లేక రాత్రి జరిగిందా? అని తెలియాల్సి ఉంది. పాఠశాలకు గురువారం ఉదయం వచ్చిన విద్యార్థులు ముందుగా మరుగుదొడ్లు ధ్వంసం కావడాన్ని చూసి ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానోపాధ్యాయుడు మోహన రామలింగయ్య పరిశీలించి చూసి సుమారు రూ.2.50 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు. హెచ్‌ఎం, ఎంపీటీసీ సభ్యుడు గరికపాటి రాజేంద్ర, స్థానిక నాయకులు వంశీధర్‌రెడ్డి, రియాజ్, కేతు వెంకటరమణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాఘవేంద్రలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఇదే పాఠశాలలో 2023 డిసెంబర్ 31న చోరీ జరిగ్గా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment