
రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు
ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ గంగాధరం
నెల్లూరు(అర్బన్): ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆర్‌అండ్‌బీ పరిధిలోని 460 కిలోమీటర్ల పరిధిలో రోడ్లు వేసేందుకు, 15 మేజర్ బ్రిడ్జిల నిర్మాణానికి, రోడ్ల వెడల్పుకు, సింగిల్ రహదారులను డబుల్‌గా మార్చేందుకు రూ.1,000 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపామని ఆ శాఖ ఎస్‌ఈ గంగాధరం తెలిపారు. నెల్లూరులోని తన కార్యాలయంలో గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. అన్ని మండల హెడ్‌క్వార్టర్స్‌కు రోడ్లు వేస్తామన్నారు. ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన రూ.19.8 కోట్లతో 790 కిలోమీటర్ల పరిధిలో చేపట్టిన ప్యాచ్ వర్కు పనులు 95 శాతం పూర్తయ్యాయని తెలిపారు. 255 కిలోమీటర్ల పరిధిలో ప్యాచ్‌వర్కులు చేసినా వాటిని సరిచేయలేమన్నారు. వీటి ని పునఃనిర్మించేందుకు రూ.80 కోట్ల అవసరం కానున్నాయన్నారు. నెల్లూరులోని పొదలకూరు రోడ్డులో మరమ్మతులు జరుగుతున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment