సంగం: ఈనెల 16వ తేదీన పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వ్యక్తి నెల్లూరులోని వైద్యశాలలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు సంగం పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు.. మండలంలోని అనసూయనగర్‌కు చెందిన ఎ.హరిబాబు (32) మద్యానికి బానిసై అప్పులపాలయ్యాడు. అప్పుల బాధలు తాళలేక పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు గుర్తించి నెల్లూరులోని వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment