
బీపీసీఎల్ నిర్మాణానికి ప్రజలంతా వ్యతిరేకం
ఉలవపాడు: బీపీసీఎల్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని.. తీరప్రాంతంలో చేస్తున్న భూసేకరణ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని మానవహక్కుల వేదిక డిమాండ్ చేసింది. వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు వీఎస్ కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేష్, రాష్ట్ర కార్యదర్శి రోహిత్, చేనేత జన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు మోహనరావు, మత్స్యకార సంఘం నాయకులు దుర్గారావులు మూడురోజులుగా మండల పరిధిలోని కరేడు, కొత్తపల్లెపాళెం, టెంకాయచెట్లపాళెం, అలగాయపాళెం, చాకిచర్ల, పెదపట్టపుపాళెం గ్రామాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. గురువారం ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రాంతంలో ఆరువేల ఎకరాల్లో సంవత్సరానికి 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రిఫైనరీ, పెట్రో కెమికల్స్ కాంప్లెక్స్‌తోపాటు అదనంగా భవిష్యత్ అవసరాల కోసం మరో పదివేల ఎకరాలు తీసుకోవాలనుకోవడం రైతులకు ఏ మాత్రం ఇష్టం లేదన్నారు. కరేడు నుంచి పోర్టు వరకు రైల్వే లైను, సముద్రం మధ్య ఉన్న అధిక శాతం మత్స్యకారులు, గిరిజనులతో మాట్లాడగా వారు ఈ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకమని చెప్పారన్నారు.
మానవహక్కుల వేదిక
ప్రజాభిప్రాయ సేకరణ
భూసేకరణ ప్రయత్నాలను
విరమించుకోవాలని డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment